దేవ‌ర‌కొండ రాజ‌కీయ పార్టీల్ని కెలికాడే!?

Tuesday, October 2nd, 2018, 12:07:12 AM IST


నిన్న‌నే విజ‌య‌వాడ బెంజి స‌ర్కిల్‌లో భారీగా అభిమానుల స‌మ‌క్షంలో `నోటా`కు ప్ర‌చారం చేశాడు దేవ‌ర‌కొండ‌. నేటి సాయంత్రం హైద‌రాబాద్ కోట్ల విజ‌య‌భాస్క‌ర రెడ్డి స్టేడియంలో జ‌రిగిన భారీ ఈవెంట్‌లో నైజాం అభిమానులు, రాజ‌కీయ పార్టీల్ని ఉద్ధేశించి దేవ‌ర‌కొండ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ముఖ్యంగా నోటా నొక్కేస్తార‌ని భ‌య‌ప‌డుతున్నారా? అంటూ గిచ్చేశాడు. ఓవైపు నోటా గురించి కోర్టులో కేసులు వేస్తూ రాజ‌కీయ పార్టీలు కెలుకుతుంటే.. అదేమీ ప‌ట్ట‌న‌ట్టు మ‌రోసారి ప్రీఈవెంట్‌లో దేవ‌ర‌కొండ ఇలా కెలికాడేంటి? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

దేవ‌ర‌కొండ నేటి ఈవెంట్‌లో మాట్లాడుతూ.. నిన్న ఏపీలో ఫస్ట్ పబ్లిక్ మీట్ రెస్పాన్స్ మాములుగా లేదు. అంతకు మించి నైజాంలో రెస్పాన్స్ ఉంది.. అంటూ ప్రాంతీయ‌ సెంటిమెంటును ర‌గిల్చాడు. మా సినిమా రిలీజ్ ఆపేయాలని చాలా చేస్తున్నారు. అఫడవిట్లు పెడుతున్నారు.. ఎలక్షన్స్ టైం లో వస్తుండడంతో అంద‌రూ నోటా బటన్ నొక్కేస్తారని భ‌య‌ప‌డుతున్నారు. తెలంగాణ లో ఒక పార్టీ కి ఫేవర్ గా ఈ సినిమా ఉంటుంద‌ని అంటున్నారు..“ అంటూ వివాదాల్ని ట‌చ్ చేశాడు. అలాంటి ఇష్యూస్ ఈ సినిమా లో లేనే లేవు.. కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అనీ తెలిపాడు. అయినా సినిమాలు చూసి జ‌నం ఓటేస్తారా? అంటూ రెచ్చ‌గొట్టాడు. మొత్తానికి దేవ‌ర‌కొండలో ప్ర‌చారం స్కిల్ స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. వివాదాల్ని రెచ్చ‌గొట్టి త‌న‌కు కావాల్సిన ప్ర‌చారం చేసుకోవ‌డ‌మెలానో వ‌ర్మ నుంచి కొన్ని టిప్స్ కూడా తీసుకున్న‌ట్టే అర్థ‌మ‌వుతోంది. ఈనెల 5న నోటా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.