దేవినేని : జగన్, విజయసాయి రెడ్డి పాపాలు తొందరలోనే భయటకు వస్తాయి

Friday, May 17th, 2019, 12:40:51 PM IST

ఏపీ మంత్రి దేవినేని ఉమ నేడు మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే పనిలో ఉన్నారని, అందుకోసం జగన్ కోట్లు ఖర్చుపెట్టారని ఆయన అన్నారు. అంతేకాదు జగన్, విజయసాయి రెడ్డి, ప్రశాంత్ కిషోర్ పాపాలు భయటపడే సమయం దగ్గరలోనే ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, ఏపీలో వైసీపీ గెలవాలని కేవీపీ కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరుతున్న కేవీపీకి గట్టి కౌంటర్ వేశారు. పోలవరానికి సంబంధించిన సమాచారమంత ఆన్‌లైన్‌లో ఉందని అవసరమైతే మీరు చూసుకోవచ్చు అని చెప్పరు. అంతేకాదు కేవీపీపై అమెరికాలో చాలా కేసులు ఉన్నాయని అలాంటి వ్యక్తి వచ్చి ఇలా మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందని కూడా అన్నారు.

అయితే ఈ సారి కూడా ఏపీలో ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయంగా కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు దేశ రాజకీయాలలో చంద్రబాబు కీలక పాత్ర పోశిస్తారని, ఈ సారి కేంద్రంలో కొత్త ప్రధాని రావడం ఖాయమని కూడా చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ప్రజలుపెద్ద ఎత్తున పాల్గొనాలని, అభివృద్ధి, సంక్షేమాలు అందించిన టీడీపీ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సారైనా ఈవీఎంలలో సమస్యలు తలెత్తకుండా చూడాలని ఎన్నికల కమీషన్‌ను ఆయన కోరారు.