వై ఎస్ జగన్ ఎందుకింత దిగజారుడుగా ప్రవర్తిస్తున్నావ్..?

Monday, October 8th, 2018, 03:45:36 PM IST

నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ చీపురుపల్లి లో నిర్వహించినటువంటి బహిరంగ సభలో మాట్లాడుతుండగా వచ్చినటువంటి ప్రభుత్వ అంబులెన్సును ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద కొన్ని సంచలనమైన మరియు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసినదే.అయితే ఇప్పుడు ఈ మాటలపై జగన్ యొక్క అవగాహనా రాహిత్యాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు దేవినేని ఉమా గారు ఈ రోజు బహిరంగంగా అక్కడ జరిగినటువంటి విషయాన్నీ వెల్లడించారు.

నిన్న జగన్ చంద్రబాబు తన సభకి భంగం కలిగించాలనే ఆ అంబులెన్సుని పంపించారని,ఇది చంద్రబాబు యొక్క నికృష్ట ఆలోచనా భావం అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై దేనినేని ఉమా వివరణ ఇస్తూ అసలు ఆ అంబులెన్సు అక్కడికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో జగన్ తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని,ఆ అంబులెన్సులో అక్కడి జగన్ సభను వీక్షించేందుకు వచ్చిన ఒక వైసీపీ అభిమానికి ప్రమాదవశాత్తు దెబ్బ తగలడంతో వారి వైసీపీ అభిమానులే 108ని సంప్రదిస్తే వేరే గత్యంతరం లేక ఆ రోడ్డులో వెళ్ళవలసి వచ్చిందని పేర్కొన్నారు.

అంతే కాకుండా జగన్ అక్కడ చాలా డ్రామాలు ఆడారని,అసలు ఎందుకింత దిగజారుడు మాటలు,దిగజారుడుగా ప్రవర్తిస్తున్నావ్ అని ఎద్దేవా చేశారు.అదే సందర్భంలో ఆ సంఘటనకు సంబందించిన ఆధారాలను చూపిస్తూ మీడియా ముఖంగా జగన్ చేస్తున్నటువంటిది ఓకే నాటకం కాదా అని జగన్ కు మరియు ఆయన పార్టీ కార్యకర్తలకు సవాల్ విసిరారు.