నేరుగా కోర్టుకు వెళ్లి పుట్టుమచ్చలు చూపించనున్న ధనుష్..!

Saturday, February 25th, 2017, 12:04:56 PM IST


హీరో ధనుష్.. ఇంతకీ ఎవరి కొడుకు అన్న సందిగ్దత వీడడం లేదు.మధురై కి చెందిన మీనాక్షి కదిరేశన్ దంపతులు ధనుష్ తమ కుమారుడే అంటూ కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. ధనుష్ తమ కుమారుడే అంటూ వాళ్ళు జస్టిస్ చొక్కా లింగంకు పత్రాలను అందజేశారు. వాటిని పరిశీలించిన కోర్టు ధనుష్ ఈ నెల 28 లోగా తన పుట్టు మచ్చల వివిరాలను తెలియజేయాలని ఆదేశించారు.

హీరో ధనుష్ చెన్నై లోని పాఠశాలలో చదువుకున్న ఆధారాలను, పదో తరగతి పరీక్షలు రాసిన ఆధారాలను,ధనుష్ పుట్టు మచ్చల వివరాలతో కూడిన టీసీని కదిరేశన్, మీనాక్షి దంపతులు కోర్టుకు సమర్పించారు. ధనుష్ తరుపున న్యాయవాది కూడా కోర్టుకు కొన్ని ఆధారాలను చూపించినా వాటిలో పుట్టుమచ్చలు సంబందించిన వివరాలు లేవు. దీనితో ధనుష్ తప్పనిసరిగా పుట్టుమచ్చల వెరిఫికేషన్ కోసం కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగింది. కదిరేశన్, మీనాక్షి దంపతుల వాదనల్లో నిజం లేదని ధనుష్ వారి కుమారుడు కాదని కోర్టుకు తెలియజేసాడు. ఈ కేసుని కొట్టివేయవలసిందిగా కూడా కోర్టుని కోరాడు. కదిరేశన్, మీనాక్షి దంపతులు ధనుష్ తమ కుమారుడే అంటూ కొన్ని ఆధారాలు చూపిస్తుండడంతో ఈ కేసు ఆసక్తికరంగా మారుతోంది.