సఫారీల కోటలో ధవన్ అద్భుత రికార్డు !

Sunday, February 11th, 2018, 06:55:59 PM IST

ప్రఖ్యాత భారత క్రికెట్ ఓపెనర్ శిఖర్ ధవన్ ఒక అరుదైన రికార్డ్ సాధించారు. ప్రస్తుతం మంచి ఫామ్ లో వున్న ధావన్ నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో శతకం సాధించిన విషయం తెలిసిందే. ఇది తన వన్ డే కెరీర్ లో 13వ శతకం. ఈ సెంచరీతో ధవన్ పలు అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సెంచరీ ఒక ప్రత్యేకత సాధించింది. ఇది ఆయన ఆడిన నూరవ వన్డే. ఆ విధంగా నూరవ వన్డేలో శతకం సాధించిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. దీనితో పాటు సఫారీల కంచుకోట వాండరర్స్‌లో దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా కూడా ధవన్ మరొక రికార్డ్ సాధించారు. గతంలో భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ 2001లో వాండరర్స్‌లో చెరొక సెంచరీ సాధించారు. అంతేకాక, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే నూరు వన్డేల్లో ధవన్ ఎక్కువ పరుగులు చేశారు. నూరు వన్డేల్లో కోహ్లీ మొత్తం 4,107 పరుగులు చేయగా ధవన్ 4,309 పరుగులు చేశాడు. అయితే నిన్న జరిగిన ఈ నాలుగో వన్డేలో భారత్, సఫారీల చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే…..

  •  
  •  
  •  
  •  

Comments