వైరల్ వీడియో : టీవీలో నాన్నని వెతికి పట్టేశాడు..!

Friday, October 27th, 2017, 10:54:02 AM IST

టీం ఇండియా గబ్బర్ గా పేరుగాంచిన శిఖర్ ధావన్ తనదైన రోజున మైదానం చెలరేగిపోగల సత్తా ఉన్న ఆటగాడు. ధావన్ చురుకు దనం మైదానంలోనే కాదు సోషల్ మీడియాలో సైతం ఉంటుంది. తన కుటుంబంతో గడిపిన క్షణాలని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటాడు. బుధవారం టీం ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభానికి ముందు తన ఇంట్లో జరిగిన అపురూప దృశ్యాన్ని ధావన్ ట్విట్టర్ లో షేర్ చేసాడు.

మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లు జాతీయ గీతాన్ని ఆలపించాయి. ఆ సమయంలో శిఖర్ ధావన్ భార్య అయేషా కొడుకు జొరావర్ తో కలసి ఇంట్లో మ్యాచ్ చూస్తోంది. టీం ఇండియా ఆటగాళ్లంతా వరుసగా నిలబడి జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. తన తండ్రి ఎక్కడున్నాడో కనిపెట్టేసిన జొరవర్.. అమ్మా..నన్నే కదా అంటూ ప్రశ్నించాడు. దానికి అయేషా అవునని బదులిచ్చింది. దీనికి సంబందించిన వీడియోని ధావన్ అభిమానులతో పంచుకున్నాడు. నా కొడుకు నేను ఎక్కడున్నానో వెతుక్కోవడం సంతోషంగా అనిపించింది. నా ఆశీస్సులతో పాటు ఆ దేవుని ఆశీస్సులు కూడా అతడికి ఎల్లప్పుడూ ఉంటాయి అని ధావన్ ట్వీట్ చేశాడు.