ధోని-విరాట్ అభిమానులు మర్చిపోలేనిది ఆ ఒక్క రోజే..!

Wednesday, September 26th, 2018, 09:05:49 PM IST


2018 సెప్టెంబరు 25వ తేదీని ధోని మరియు విరాట్ అభిమానులు ఎప్పటికి మర్చిపోలేని రోజు.ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న ఆసియ కప్ మ్యాచుల్లో ఇప్పటికే విరాట్ మరియు రోహిత్ లకు విశ్రాంతిని అందించారు,దానితో మళ్ళీ ఇన్నాళ్లకు మహేంద్ర సింగ్ ధోని మళ్ళీ టీం ఇండియాకు కెప్టెన్ గా భాద్యతలు చేపట్టారు.దానితో ధోని అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు,అదే విధంగా నిన్ననే విరాట్ కోహ్లీకు ఒక అరుదైన గౌరవం కూడా దక్కింది. భారత క్రీడాకారులకు దక్కే అరుదైన రాజీవ్ గాంధీ “ఖేల్ రత్న” అవార్డును భారతదేశ రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నాడు.ఈ రోజు మాత్రం వారి అభిమానులకు ఖచ్చితంగా గుర్తుండిపోయే రోజు అని వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.విరాట్ ఖేల్ రత్న అవార్డును అందుకున్న మూడో భారత క్రికెటర్ గా రెకార్డులకెక్కగా,ధోని కెప్టెన్ గా తన 200వ ఆటను పూర్తి చేసుకున్నారు.