బౌలర్ల వల్లే ఓడిపోయాం .. ధోని అసహనం!

Saturday, May 12th, 2018, 05:20:52 PM IST

సాధారణంగా మహేంద్ర సింగ్ ధోని ఆగ్రహానికి లోనవ్వడం చాలా అరుదు. ఒకవేళ మిస్టర్ కూల్ కి కోపం వచ్చిందంటే ఆ రోజు క్రికెట్ ప్రపంచంలో ఒక సెన్సేషన్ న్యూస్ అయినట్టే. ఇక శుక్రవారం రాజస్థాన్ లో జరిగిన మ్యాచ్ లో కూడా ధోని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాజస్థాన్ తో ఆడిన మ్యాచ్ ఓడిపోవడానికి కారణం చెన్నై బౌలర్ల వైఫల్యం చాలానే కనిపించింది. అదే విషయాన్నీ ధోని చెప్పాడు. గెలిచే మ్యాచ్ ను చివరి దశలో బౌలర్లు ఓడించారని ఫీల్డింగ్ కూడా దెబ్బకొట్టిందని చెప్పాడు.

మొదట ఒక చోట బంతులు విసరమని చెబితే బౌలర్లు మరో చోట విసిరారు. అందువల్ల చివరి ఓవర్లలో ప్రత్యర్థులకు బౌండరీలు కొట్టేందుకు అవకాశం దక్కిందని చెప్పారు. స్కోర్ 176 అంటే తప్పకుండా గెలవవచ్చని అనుకున్నాం. ఫీల్డింగ్ వైఫల్యం కూడా ఉంది. చివరి ఓవర్ లో బట్లర్ బంతిని పైకి కొట్టగా క్యాచ్ కోసం బౌలర్లు ఎవరు పరిగెత్తకపోవడం ధోనిని తీవ్ర అసహనానికి గురి చేసింది. చెన్నై ఆ మ్యాచ్ గెలిస్తే దాదాపు ప్లే ఆఫ్ బెర్త్ ను ఫిక్స్ చేసుకునేది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో చెన్నై 14 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది.