వైరల్ వీడియో :దిక్కులు చూస్తున్నావ్ ఏంటీ.. ధోని కోపం చూశారా?

Thursday, February 22nd, 2018, 04:00:00 PM IST

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ వికెట్ కీపర్ ధోనికి క్రమశిక్షణలో ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు అంటే చాలు ప్రత్యర్థి జట్టును ఎలా ఓడించాలి మ్యాచ్ ను ఎలా గెలిపించాలి అనే తరహాలో మాస్టర్ ప్లాన్స్ వేస్తుంటాడు. ముందుగా జట్టును మొత్తం ధోని తన అదుపులో పెట్టుకుంటాడు అనేది అందరికి తెలిసిన విషయమే. కెప్టెన్ గా లేకపోయినప్పటికీ కోహ్లీకి సూచనలు ఇస్తూ జట్టు ను గెలిపించేందుకు ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ధోనికి సాధారణంగా కోపం రాదు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కూల్ కెప్టెన్ అని ప్రపంచ క్రికెట్ దిగ్గజాలతో అనిపించుకున్నాడు.

అయితే బుధవారం సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్ లో ధోని ఒక్కసారిగా కోపానికి గురయ్యాడు. నాన్ స్ట్రైక్ లో ఉన్న మనీష్ పాండే పై ఆగ్రహానికి గురవ్వడంతో అందరు షాక్ అయ్యారు. చివరి ఓవర్లో మొదటి బంతికి మనీష్ పాండే సింగిల్ తీసి ధోనికి స్ట్రైకింగ్‌ ఇచ్చాడు. అయితే ధోని ఒక్కసారిగా మనీష్ పై అరిచేశాడు. దిక్కులు చూస్తూ ఉండడంతో దిక్కులు చూస్తున్నావ్ ఏంటి? ఇటు చూడు అంటూ కేకలు వేశాడు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయినా సంగతి తెలిసిందే.