వీడియో: ధోనితో జీవా సరదాగా..

Tuesday, May 22nd, 2018, 12:07:36 AM IST


ఐపీఎల్ తుది దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. చూస్తుండగానే లీగ్స్ మ్యాచ్ లు ముగిశాయి. అయితే ధోని కి సంబందించిన వీడియోలే ఈ సీజన్ లో వైరల్ గా అయ్యాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ధోని కూతురు జీవా కూడా సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా నిలిచింది. రీసెంట్ గా ధోని – జీవాల మధ్య ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఆదివారం పంజాబ్ – చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ధోని సేన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం అవార్డుల ప్రదానోత్సవంలో జీవా తండ్రితో ఆడుతూ కనిపించింది. క్యాప్ తీస్తూ మళ్లీ పెడుతూ కేరింతలు కొట్టడం అందరిని ఎంతగానో ఆకర్షించింది. మైధానంలో అందరు జీవా ను చూస్తూ నినాదాలు చేశారు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రేపు చెన్నై హైదరాబాద్ టీమ్ తో తలపడనున్న సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments