ధోని లేని లోటు..సిరీస్ కైవసం చేసుకున్న ఆసీస్..!

Wednesday, March 13th, 2019, 09:40:59 PM IST

భారత్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రారంభమైన వన్డే సిరీస్ ఈ రోజుతో పూర్తయ్యింది.ఢిల్లీ స్టేడియం వేదికగా ఈ రోజు భారత్ మరియు ఆసీస్ జట్ల మధ్య రెండు జట్లకు కీలకమైన ఫైనల్ మ్యాచ్ జరిగింది.ఈ సిరీస్ ప్రారంభమైన మొదటి రెండు మ్యాచులు మనమే గెలిచేయడంతో ఒక్క మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే అనుకున్న తరుణంలో ఆసీస్ అదృష్టాన్ని తమ వైపు తిప్పేసుకుని తర్వాతి మూడు మ్యాచులు వరుసగా గెలిచి సిరీస్ కైవసం చేసుకున్నారు.ఈ రోజు మొదలైన మ్యాచ్ నిర్ణీత ఓవర్లలో ఆసీస్ 272 స్వల్ప లక్ష్యాన్నే ఇవ్వగా దాన్ని కూడా ఛేదించలేక మన వాళ్ళు 237 పరుగులకే చేతులెత్తేశారు.

గడిచిన రెండు మ్యాచుల్లోనూ ధోని లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని సీనియర్ క్రికెటర్లుతో పాటు సాధారణ జనం కూడా ఇప్పుడు భావిస్తున్నారు.కష్ట కాలంలో ఉన్నపుడు భారత జట్టుకి ధోని ఇచ్చిన సహకారం మర్చిపోలేనిది.సరైన సమయంలో సరైన వ్యూహాలు వెయ్యడంలో ధోని దిట్ట.ఇప్పుడు ఆ ధోని లేని లోటు ఈ రెండు మ్యాచులలో కనిపిస్తుందని అందరూ అంటున్నారు.రోహిత్ శర్మ మరియు భువనేశ్వర్,కేదార్ జాదవ్ లు మెల్లగా నెట్టుకొచ్చిన అది మన జట్టు విజయం దగ్గరకి తీసుకెళ్లలేకపోయారు.ఆసీస్ బౌలింగ్ కూడా ఈ రోజు అలాగే పడింది.

ఆడం జంపా 3 వికెట్లు,ఫ్యాట్ కమ్మిన్స్, స్టోయినిస్,రిచర్డ్ సన్లు రెండేసి వికెట్లు పడగొట్టి ఆసీస్ జట్టుకి విజయాన్ని అందించారు.అలాగే గత మ్యాచ్ లోనే విజృంభించిన ఖవాజా ఈ మ్యాచులో కూడా మరో సెంచరీని తన ఖాతాలో వేసుకోగా హ్యాండ్స్ కొమ్బ్ హాఫ్ సెంచరీ చేసారు.కానీ ఈ మ్యాచుకి ధోని ఉండి ఉంటే మాత్రం ఫలితం ఇలా కాకున్నా వేరేలా ఉండేదని మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.