ధోని ఏం చేస్తున్నాడో తెలుసా?

Monday, June 4th, 2018, 03:37:05 PM IST

మహేంద్ర సింగ్ ధోని గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా కూడా అది వైరల్ అవ్వకుండా ఉండదు. చాలా కాలం తరువాత చెన్నై కెప్టెన్ గా జట్టుకు ట్రోపిని అందించిన మిస్టర్ కూల్ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అని అందరిలో కలుగుతున్న సందేహం. మొదట ముంబై లో ఫైనల్ మ్యాచ్ అవ్వగానే ధోని అండ్ గ్యాంగ్ చెన్నై వెళ్లి అక్కడ ప్రాంచైజీ వారు ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఇక ఆ తరువాత ధోని తనకు ఇష్టమైన తన సొంత గడ్డ రాంఛీ కి వెళ్లాడు.

ఆ తరువాత రాంఛీ కి అరవై కిలో మీటర్ల దూరంలో ఉన్న దుర్గామాత ఆలయానికి వెళ్లి అక్కడ పూజలు చేశారు. ధోనీ ఏ టోర్నీకి ముందు అయినా తరువాత అయినా ఈ ఆలయానికి వెళ్లడం కామన్. అలాగే బైక్ లో తాను చిన్నప్పుడు తీరిగిన ప్రదేశాలను చుట్టేసి రావడం కూడా ధోనికి అలవాటే, హెల్మెంట్ ధరించి లాంగ్ ట్రిప్పులు వేస్తుంటాడు. ఇక ప్రస్తుతం రాంఛీ లోని ఫార్మ్ హౌజ్ లో తన కుటుంబ సభ్యులతో మహి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల సచిన్ అభిమాని సుదీర్ కుమార్ గౌతమ్ కూడా ధోని ఫార్మ్ హౌస్ లో కనిపించాడు. ఇక ఈ ఏడాది చివరలో ఐర్లాండ్ తో జరిగే టీ20 సీరీస్ కు ధోని హాజరు కానున్నాడు. 2018 ఐపీఎల్ ద్వారా పూర్తి ఫామ్ లోకి వచ్చాడు. 16 మ్యాచ్ లలో ధోని 455 పరుగులు చేశాడు.

  •  
  •  
  •  
  •  

Comments