అత్యధిక సంపాదన కలిగిన క్రీడాకారులలో ధోనికి 16వ స్థానం

Tuesday, August 20th, 2013, 03:00:45 PM IST

dhone
ప్రపంచంలో అత్యధిక సంపాదన కలిగిన క్రీడాకారులలో ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 16వ స్థానంలో ఉన్నట్టు ఫోర్బెర్స్ తాజా నివేదికలో తెలియజేసింది. అది దాదాపు 180 కోట్లు. తన తరువాత స్థానంలో రాఫెల్ నాదల్, ఉసైన్ బోల్ట్ లు వున్నారు.
31 సంవత్సరాలు వున్న మహేంద్ర సింగ్ దోని 2012 -2013 మద్య కాలంలో ఆయన సంపాదన రూ. 180 కోట్లుగా ఫోర్బెర్స్ తన తాజా నివేదికలో తెలియజేసింది. ఈ లిస్టులో తన తరువాత ఎఫ్1 రేసర్ ఫెమండో అలోన్సో 19వ స్థానంలో, లెవీస్ హామిల్టన్ 26వ స్థానంలో, రాఫెల్ నాదల్ 30వ స్థానంలో, ఉసైన్ బోల్ట్ 40వ స్థానంలో వున్నారు. ఈ సంపాదనని వారి జీతాలుమ బోనస్ లు మొదలగు సంపాదనలన్ని కలుపుకొని లెక్కించడం జరిగింది.