ధోనికి బాగా కలిసొచ్చిన నెంబర్ అదే

Tuesday, May 29th, 2018, 03:30:53 AM IST

భారత జట్టు కెప్టెన్ గా ఎన్నో విజయాలను అందించి ఎవరు అందుకొని క్రెడిట్ అందుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని. కెప్టెన్ గా ప్రపంచ క్రీడా అభిమానులను ఆకర్షించిన ధోని క్రికెట్ లో ఎప్పటికప్పుడు తన టాలెంట్ ను బయటపెడుతూనే ఉన్నాడు. నేషనల్ టీమ్ కు కెప్టెన్ గా బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఫ్యాన్స్ నిరాశ చెందినా ఐపీఎల్ తో మాత్రం మళ్లీ తన నాయకత్వ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నాడు. చెన్నై జట్టు రెండేళ్ల తరువాత రీ ఎంట్రీ ఇచ్చింది. ధోని మళ్లీ కెప్టెన్ గా ఉండి జట్టుకు మొత్తంగా మూడోసారి ట్రోపిని అందించాడు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ధోనికి ఒక తేదీ మాత్రం బాగా కలిసిచ్చిందనే చెప్పాలి. అతని కెరీర్ లో కొన్ని మధుర జ్ఞాపకాలు విజయాలు అదే తేదీన జరగడం విశేషం. 27వ తేదీ ధోనికి బాగా కలిసొచ్చింది అని అభిమానులు ఈ న్యూస్ ను తెగ షేర్ చేసుకుంటున్నారు. మే 27న ధోని ఐపీఎల్ 11 ట్రోపిని తన జట్టుకు అందించాడు. ధోని 2003 జనవరి 28న రాష్ట్ర జట్టు జార్ఖండ్ కు మొదటి మ్యాచ్ ఆడాడు. అలాగే మరో ఏడాది తరువాత 2004 ఫిబ్రవరి 28న ఇండియా తరపున జట్టుకు ఎంపికయ్యాడు.

ఇక 2007 మార్చ్ 27న ధోని ఇండియా జట్టు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఇక చాలా కాలం తరువాత ధోని కెరీర్ లో కీలకమైన తేదీ ఈ ఏడాదిలో వచ్చింది. రెండేళ్ల నిషేధం తరువాత చెన్నైకు మళ్లీ తన కెప్టెన్సీ తో కొత్త కళను నింపి ట్రోపిని అందించాడు. ఆ విధంగా తన కెరీర్ లో ధోనికి 27 అనే నెంబర్ బాగా కలిసీ వచ్చిందనే చెప్పాలి. పైగా 27 లో 7 నెంబర్ ధోని జెర్సీ నెంబర్ కూడా అవ్వడం విశేషం.

  •  
  •  
  •  
  •  

Comments