ధోని సరికొత్త హెయిర్ స్టైల్ చూశారా..

Monday, July 30th, 2018, 01:40:54 PM IST

ఒక క్రికెట్ ప్లేయర్ గానే కాకుండా స్టైలిష్ మోడల్ గా కూడా ధోనిని అభిమానులు ఇష్టపడతారు. ఎందుకంటే ధోని ఆటలో ఎంతన ఆకట్టుకునే విధంగా ఉంటాడో రియల్ లైఫ్ లో కూడా అదే తరహాలో తన ఫ్యాషన్ లుక్ తో ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా హెయిర్ స్టైల్ తో ధోని ఆకర్షించే విధానం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. కెరీర్ స్టార్టింగ్ లో ధోని లాంగ్ హెయిర్ ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఆ తరువాత కూడా ధోని రాకరకరాల హెయిర్ స్టైల్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇక రీసెంట్ గా మరో రకమైన స్టైల్ లో కనిపించి వైరల్ అయ్యేలా చేశాడు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనను ముగించుకొని స్వదేశానికి వచ్చిన మిస్టర్ కూల్ ముంబై కి వెళ్లి ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్‌‌ వద్ద కొత్తగా ‘వీ హాక్‌’. స్టైల్‌ చేయించుకున్నాడు. అందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.