కెప్టెన్ రోహిత్ అయినా అంతా ధోని కంట్రోల్ లోనే!

Tuesday, September 18th, 2018, 03:07:57 PM IST

ఆసియా కప్ కి సిద్దమైన భారత జట్టు ఎలాగైనా విజయం సాధించాలని ప్రాక్టీస్ లో తెగ కష్టపడుతోంది. చాలా రోజుల తరువాత జట్టుతో కొత్త ఆటగాళ్ళు కలిశారు. ఇక ఈ టోర్నీకి విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడం లోటనే చెప్పాలి. రోహిత్ శర్మకు కెప్టెన్స్ పగ్గాలు అప్పగించారు. వరుసగా రెండు రోజులు టీమిండియా మ్యాచ్ లు ఆడనుంది. నేడు హాంకాంగ్ తో పోటీ పడనుండగా రేపు పాకిస్తాన్ తో డీ కొట్టడానికి జట్టు రెడీ అవుతోంది.

అయితే యూఏఈకు భారత జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రితో పాటు ఇతర సహాయక సిబ్బంది ఇంకా రాలేదు. దీంతో మాజీ సారధి సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని దగ్గరుండి టీమ్ ని చూసుకుంటున్నాడు. నిజం చెప్పాలంటే ధోని ఒక మెంటర్ గా వ్యవహరిస్తున్నాడనే చెప్పాలి. ప్రస్తుతం జట్టులో ఉన్న కీలక ప్లేయర్స్ అందరూ ధోని నుంచి సలహాలు తీసుకునేవారే. రోహిత్ అయినా విరాట్ అయినా ధోని చెప్పినట్లు చేయడమే కరెక్ట్ అంటారు. ఇప్పుడు కెప్టెన్ రోహిత్ అయినా కూడా ధోని కంట్రోల్ లోనే జట్టు నడుస్తుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇకపోతే ప్రాక్టీస్ లో ధోని యువ ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాడు. ఒత్తిడిలో బౌలింగ్ ఎలా చేయాలి అనే విషయంపై బౌలర్లకు వివరించాడు. అవీష్‌ ఖాన్‌, ప్రసిద్ధ్‌ క్రిష్ణ, సిద్దార్థ్‌ కౌల్‌, నదీమ్‌, మయాంక్‌ మార్కేండ్‌ల బౌలింగ్ ఎదుర్కొంటు ధోని టిప్స్ ఇవ్వడం ప్రాక్టీస్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.