ఈ రోజు మ్యాచ్ అంతా ఒకెత్తు ధోని చేసిన రనౌట్ ఒకెత్తు..!

Sunday, February 3rd, 2019, 05:21:21 PM IST

న్యూజిలాండ్ తో భారత్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ సిరీస్ కి సంబంధించి ఆఖరి వన్డే ఈ రోజు వెల్లింగ్ టన్ వేదికగా వెస్ట్ పాక్ స్టేడియంలో జరిగింది,అయితే ఈ మ్యాచులో ముందు బ్యాటింగ్ కు దిగిన మన జట్టు వారు 49.5 ఓవర్లలో 252 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ముందు ముందు ఉంచారు.టాప్ ఆర్డర్ విఫలం కాగా మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ అయినటువంటి విజయ్ శంకర్ మరియు హార్దిక్ పాండ్య బ్యాట్ తో అద్భుత ప్రదర్శనను కనబర్చారు.ఇక తెలుగుతేజం అంబటి రాయుడు ఈ రోజు భారత్ అంత స్కోర్ చెయ్యడానికి ప్రధాన కారణం అనే చెప్పాలి.113 బంతుల్లో 90 పరుగులు తీసి మ్యాచ్ కి కీలకంగా మారారు.

ఇక గత మ్యాచ్ కి గాయంతో దూరమైన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన బ్యాట్ తో విఫలమైనా మరోసారి కీపింగ్ లో తనకి ఎదురు లేదని నిరూపించారు.అప్పటికే కివీస్ జట్టులో జేమ్స్ నీషం దుమ్ము దులిపేస్తున్నాడు.ఆ సమయంలో కేదార్ జాదవ్ 36.2 వ ఓవర్లో వేసిన బంతితో ధోని ఆ మ్యాచ్ తిప్పేశారు.అసలే స్పిన్ ఓవర్లో వికెట్లు వెనుక ధోని ఉన్నపుడు క్రీజులో ఆటగాడికి దడగా ఉంటుంది అలాంటిది పొరపాటుగా కాలు గాల్లోకి లేపితేనే స్టంప్ చేసి ధోని పెవిలియన్ కు పంపుతారు.

అలాంటిది జేమ్స్ కాలికి జాదవ్ వేసిన బంతి తగలగా ముందు అవుట్ అప్పీల్ చేసారు.ఆ సమయం కొంచెం ధోనిని దాటి బంతి ముందుకు వెళ్లగా జేమ్స్ సింగిల్ తీద్దామని ప్రయత్నించాడు.అంతే ధోని చేతికి బాల్ చిక్కింది.రెప్పపాటులో జేమ్స్ ని రనౌట్ చేసేసి ధోని ఆశ్చర్యపరిచాడు.ఈ ఒక్క అవుట్ తో ధోని ఈ మ్యాచ్ అంతటిని తిప్పేసాడు.ఆ తర్వాత ఇక న్యూజిలాండ్ జట్టు 44 ఓవర్లలో 217 పరుగులకే ఆలవుట్ అయ్యిపోవడం తో మన జట్టు 4-1 తో సిరీస్ కైవసం చేసుకున్నారు.ఇప్పుడు ధోని చేసిన ఈ రనౌత్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.