వీడియో : ధోని నవ్వితే ఆ వీడియో ట్రెండ్ అవ్వాల్సిందే!

Saturday, May 19th, 2018, 06:44:42 PM IST

మహేంద్ర సింగ్ ధోనికి సంబందించిన సరదా వీడియోలు వైరల్ అవ్వడం కామన్ అని అందరికి తెలిసిన విషయమే. అయితే రీసెంట్ గా ధోని పగలబడి నవ్విన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐపీఎల్‌ లో శుక్రవారం దిల్లీ డేర్‌డెవిల్స్‌-చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంది. టాస్ వేసే క్రమంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ వేస్తుండగా కాయిన్ దూరంగా పడింది. అది చూసిన ధోని ఒక్కసారిగా నవ్వేశాడు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఆ మ్యాచ్ లో ఢిల్లీ అద్భుతమైన ఆట తీరుని కనబరిచి 38 పరుగుల తేడాడో గెలిచింది. అయితే ముందుగానే చెన్నై 16 పాయింట్లతో ప్లే ఆఫ్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక టోర్నీ నుంచి వైదొలిగిన తొలి జట్టుగా ఢిల్లీ ఈ సారి అందరిని నిరుత్సాహపరిచింది.