తన ఫిట్ నెస్ రహస్యాలను వెల్లడించిన ధోని !

Wednesday, June 13th, 2018, 03:24:49 PM IST

భారత క్రికెట్ మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం తనకు 36ఏళ్ళ వయసున్నప్పటికీ ఎప్పుడు ఫిట్ గా కనపడడానికి కారణం ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడమే అంటున్నాడు. ఇటీవల తాను వెస్ట్ ఇండీస్ ఆల్ రౌండర్ బ్రావోతో కలిసి పాల్గొన్న త్రి రన్స్ ఛాలెంజ్ లో గెలిచి తన స్టామినా ను నిరూపించుకున్నారు. నేను మొదట్లో 2004లో క్రికెట్ లో ప్రవేశించినపుడు వున్న ఆహారపు అలవాట్లకు, ఇక ప్రస్తుతం నేను తీసుకుంటున్న ఆహారపు అలవాట్లకు చాలా తేడా ఉందని ఆయన అంటున్నారు. ఇదివరకు అంతర్జాతీయ క్రికెట్ కు వచ్చిన తొలిరోజుల్లో బట్టర్ చికెన్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, మిల్క్ షేక్స్ వంటివి అధికంగా సేవించేవాడినని, అయితే రోజులు మారడం, వయసు మీదపడడంతో ఇకనుండి ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతో రోజు తప్పకుండ ఆహారపు అలవాట్లను తూచా తప్పకుండ పాటిస్తున్నానిచెప్పుకొచ్చారు .

ఇక తాను టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తరువాతనుండి వ్యాయామం, ఆహరం పై మరింత దృష్టి పెట్టానని అప్పటినుండి కేకేలు, చాకోలెట్లు వంటివి కూడా పూర్తిగా తినడం మానేసినట్లు తెలిపారు. ఇక ఐపీఎల్ వంటి పెద్ద సమరాలు జరిగినపుడు శరీరాన్ని ఎప్పుడు ఫిట్ గా ఉండేలా చూసుకోవాలని, అందుకని ఐపీఎల్ సీజన్ మొత్తం రోజు తాను నిద్ర లేవగానే రోయింగ్ మెషిన్ పై కసరత్తులు చేసేవాడిని అన్నారు. ఇక తన అల్పాహారం కూడా అక్కడకే తెప్పించుకు తినేవాడిని అన్నారు. అందుకే వయసు పెరుగుతున్నప్పటికీ శరీరం ఎప్పుడు తన అదుపులో ఉంటుందని, అందుకు కొంత మానసిక ప్రశాంతత అవసరమని, వీలుదొరికినపుడు యోగ, ధ్యానం వంటివి చూస్తుంటానని ఇవన్నీ కూడా తన ఫిట్నెస్ రహస్యాలని ధోని వెల్లడించాడు…..

  •  
  •  
  •  
  •  

Comments