కూల్ వర్సెస్ కూల్.. చెన్నై – సన్ రైజర్స్!

Monday, May 21st, 2018, 11:00:50 PM IST


ఐపీఎల్ తుది సమరం రేపే మొదలవ్వనుంది. రేపు చెన్నై సూపర్ కింగ్స్ – సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగబోయే మ్యాచ్ రసవత్తరంగా మారనుంది. గెలిచిన జట్టే ఫైనల్ కు చేరుకుంటుంది. అయితే ధోని – విలియంసన్ ఈ మ్యాచ్ లో ఫెవరెట్ కానున్నారు. ఇద్దరు కూల్ కెప్టెన్లే కావడంతో ఎవరిదీ బెస్ట్ కెప్టెన్సీ ఉంటుందా అనేది ఆసక్తి కలిగిస్తోంది. ఆట తీరులో ధోని నెంబర్ వన్ అయినా విలియంసన్ కూడా డౌట్ రాకుండా మ్యాచ్ స్వరూపానికి మార్చేస్తాడు.

ఇద్దరు సమన విజయాలతో జట్లను పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలబెట్టారు. అయితే ఈ సీజన్ లో ఇద్దరు ఎదురుపడిన రెండు సార్లు చెన్నై గెలిచింది. ఓ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు గట్టి పోటీని ఇచ్చినప్పటికీ గెలవలేకపోయింది. ప్రస్తుతం సన్ రైజర్స్ టీమ్ బ్యాటింగ్ లో కంటే బౌలింగ్ లోనే బలంగా ఉంది. ధావన్ మెరుపు ఇన్నింగ్స్ విలియంసన్ మైండ్ గేమ్ జట్టు విజయానికి ప్లస్ పాయింట్స్. ఇక ప్రత్యర్థి జట్టు చెన్నై లో మాస్టర్ మైండ్ ధోని గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. విలియంసన్ కంటే మేటి బ్యాట్స్ మెన్. కెప్టెన్సీ లో అపారమైన అనుభవం. ఆటగాళ్లను బలంగా మార్చడంలో ధోని పాత్ర చాలానే ఉంటుంది. ఆ జట్టులో దాదాపు అందరు ఫామ్ లో ఉన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments