ధోనికి పోటీగా ముగ్గురు యువ ఆటగాళ్లు

Sunday, May 13th, 2018, 03:06:14 PM IST

దాదాపు కొన్నేళ్లుగా మన ఇండియన్ క్రికెట్ టీమ్ లో ప్రతి విభాగంలో కొన్ని మార్పులు వస్తున్నాయి. బ్యాట్స్ మెన్ ఆల్ రౌండర్ బౌలర్ ఇలా అన్నిట్లో కొత్త కొత్త ఆటగాళ్లు వస్తున్నారు. కానీ వన్డే . టీ20 ఫార్మాట్ లో ఓ స్థానంలో మాత్రం పెద్దగా మార్పులు రావడం లేదు. అదే వికెట్ కీపింగ్. దాదాపు 15 ఏళ్ల నుంచి ధోని తన స్థానాన్ని పెద్దగా వదులుకోలేదు. ఇక కెప్టెన్ గా ఎంపికయిన తరువాత మిస్టర్ కూల్ కీపింగ్ బాధ్యతలకు డోకా లేకుండా పోయింది. ప్రస్తుతం కూడా అలానే కొనసాగుతున్నాడు. వచ్చే వరల్డ్ కప్ వరకు కూడా ఉంటాడని చాలా మంది సీనియర్ క్రికెటర్స్ వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.

అయితే ధోని ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కూడా అతని స్థానం కోసం ముగ్గురు యువ ఆటగాళ్లు పోటీకి దిగడం కాయం. ఓ విధంగా చెప్పాలంటే ప్రస్తుతం వారు ప్రదర్శిస్తోన్న ఆట తీరు వల్ల ధోని స్థానంకి దాదాపు పోటీ ఇచ్చినట్లే అని తెలుస్తోంది. సంజు శాంసన్ – రిషబ్ పంత్ – ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ గానే కాకుండా మంచి బ్యాట్స్ మెన్ లుగా కూడా కొనసాగితున్నారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడుతోన్న 20 ఏళ్ల రిషబ్ ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడి 582 పరుగులు చేశాడు. పైగా అందులో ఒక సెంచరీ కూడా చేశాడు. రాజస్థాన్ తరపున ఆడుతోన్న సంజు కీలక సమయాల్లో బాగానే రాణిస్తున్నాడు. అయితే అతనికి వికెట్ కీపింగ్ అవకాశం ఎక్కువగా రావడం లేదు. రాజస్థాన్ టీమ్ లో సీనియర్ ఇంగ్లాడ్ కీపర్ బట్లర్ ఉండడంతో అతని అవకాశం దక్కడం లేదు. ఇక ముంబై ఆటగాడు ఇషాన్ కిషన్ కూడా తన బ్యాట్ తో ప్రత్యర్థులను ఒక్కోసారి భయానికి గురి చేస్తున్నాడు. భారీ షాట్లు కొట్టడంలో టైమింగ్ ను బాగా వాడుతున్నాడు. మరి ఈ ముగ్గురిలో ధోని తరువాత ఇండియన్ క్రికెట్ టీమ్ కు నిలబడే కీపర్ ఎవరో చూడాలి!