ధోనిని విమర్శించే వారికీ ఇది చెంపపెట్టు!

Friday, July 27th, 2018, 05:00:49 PM IST

మన దేశంలో అత్యంత ప్రజాధారణ పొందిన ఆటలో క్రికెట్ అని అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ ఆటలో మేటి ఆటగాళ్ల క్రేజ్ తరచు మారుతూ ఉంటుంది. కెరీర్ పరంగా చూసుకుంటే ఆటగాళ్లు నిత్యం ఫామ్ లో ఉండడం అనేది అంత సులువైన విషయం కాదు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో బెస్ట్ ప్లేయర్ గా మహేంద్ర సింగ్ ధోని నిలిచాడు. సాధారణంగా క్రికెట్ లో అందరికి నచ్చిన ఆటగాడు ఎవరని అంటే గతంలో సచిన్ అని చెప్పేవారు.

ఇక ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ పేరు కూడా వినిపించింది. అయితే మహేంద్ర సింగ్ ధోని తన ఆట కన్నా మ్యాచ్ ను గెలిపించడంలో ప్రతి విషయంలో తన పాత్ర ఉండేలా చూసుకుంటాడు. ప్రణాళికలు రచించడంలో ధోని తరువాతే ఎవరైనా. అందుకే యుగవ్‌ మార్కెట్‌ రీసెర్చ్‌ కంపెనీ నిర్వహించిన సర్వేలో ధోని అత్యంత ప్రజాధారణ పొందిన క్రికెటర్ లలో మొదటి స్థానంలో నిలిచాడు. దాదాపు 40 లక్షల మంది పాల్గొన్న ఈ సర్వేలో భారత ప్రధాని మోడీ అత్యంత ఆదరణ కలిగిన వ్యక్తిగా నిలువగా ఆ తరువాత ధోని ఉండటం విశేషం. సచిన్‌కు 6.8 శాతం, కోహ్లికి 4.5 శాతం ఓట్లు పడగా ధోనికి 7.7 శాతం మద్దతుగా ఓట్లు లభించాయి. ప్రస్తుతం ధోని ఫామ్ లో లేకపోవడం వల్ల ఆటకు ముగింపు పలకాలని రిటర్మెంట్ ఇచ్చేయాలని కొందరు చేస్తున్న కామెంట్స్ కు ఈ సర్వే గట్టిదెబ్బే కొట్టిందని చెప్పవచ్చు.

  •  
  •  
  •  
  •  

Comments