జగన్ మీద నమ్మకంతోనే చంద్రబాబు అలా చేశారా…?

Thursday, June 6th, 2019, 01:27:08 AM IST

ఎట్టకేలకు జగన్ ఏపీ సీఎం జగన్ తన పంతం నెగ్గించుకున్నారు… తన పదేళ్ల కష్టానికి ఫలితం దక్కించుకున్నాడు. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో వార్ వన్ సైడ్ చేసి మరీ చూపించాడు జగన్. ఎన్నో ఎదురు దెబ్బలకు తట్టుకొని మరీ నిలిచాడు జగన్. అందుకోసమనే తన కష్టానికి మెచ్చిన ఏపీ ప్రజలు జగన్ కి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే ఇక్కడ ఓర్పు, సహనం, ఉంటేనే నెగ్గుకొస్తారు అని రాజకీయాల్లో అంటుంటారు… జగన్ పట్టుదలతో ప్రయత్నించి విజయం సాధించాడు. ఎన్నికల్లో భారీ గెలుపును సొంతం చేసుకున్నాడు. కాగా ఎన్నికల ప్రచార సమయంలో జగన్ ఎన్నో హామీలిచ్చాడు. అందులో ఒకటి ఏపీలో మరొక 25 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. అందుకు గాను ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసేందుకు సమాయత్తం అవుతున్నారు…

జగన్ అన్న మాట మీద నిలబడతాడని చంద్రబాబుకి బాగా తెలుసు… ఈ సందర్భంగా ఎలాగైనా జగన్ మరో కొత్త 25 జిల్లాలను ఏర్పాటు చేస్తాడని భావిస్తున్న చంద్రబాబు, కొత్తగా ఏర్పడబోయే కొత్త జిల్లాలలో కమిటీలు ఏర్పాటు చేసి పలు నియోజక వర్గాలలో తమ పార్టీ బలం పెంచుకునేందుకు చంద్రబాబు ప్లాన్ వేశారని తెలుస్తుంది. అంటే జగన్ వేసిన ప్లాన్ చంద్రబాబు కి ఇలా కలిసొచ్చిందన్నమాట.