బీజేపీ పొత్తుకోసం మా దగ్గరకు వచ్చిందా..? ఏం మాట్లాడుతున్నారు..?

Tuesday, March 13th, 2018, 04:26:36 PM IST

జనం కోసమో జగన్ కోసమో తెలియని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలోకి చేరింది. ఈ నేపథ్యంలో పాదయాత్రలో పరుగులిడుతున్న జగన్‌ను ఓ జాతీయ చానల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో జగన్‌కు కొన్ని సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఎదురయ్యాయి. టీడీపీతో దూరమవుతున్న బీజేపీ పొత్తు కోసం మిమ్మల్ని సంప్రదించిందా అని జాతీయ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు జగన్ ఘాటు సమాధానమిచ్చారు. ప్రస్తుతం తమను ఏ పార్టీ పొట్టు కోసం సంప్రదిన్చాలేదనీ, బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే కాదని తనను ఏ పార్టీ సంప్రదించలేదని జగన్ చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేవని ఆయన అన్నారు. తమ పార్టీ కేంద్రంపై పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నట్లు గతంలో చెప్పిన విషయాన్నే జగన్ మరోసారి చెప్పారు. మరి ఇన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా జరుగుతున్నా జగన్ పాద యాత్ర విజయవంతం అవుతుందా లేక ఇలాగే చిక్కు ప్రశ్నల్లో చిక్కుకున్తుండా అతనికే తెలియాలి.

  •  
  •  
  •  
  •  

Comments