వై.సి.పీ ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీ సమావేశానికి హాజరు అవుతారా..?

Thursday, September 6th, 2018, 03:00:30 AM IST

ఆంధ్ర రాష్ట్రం లో ఉన్నటువంటి మూడు ప్రధాన పార్టీలలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతి పక్షము కూడాను. అయితే గత కొన్ని నెలల క్రితం వై సి పి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నది అని అందరూ అసెంబ్లీ నుంచి వాక్ అవుట్ చేసిన సంగతి తెలిసినదే. అయితే ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ కే. శివ ప్రసాద్ రావు గారు రేపు అసెంబ్లీ మీటింగుకు ఎమ్మెల్ల్యేలు అందరిని హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

దీనికి గాను వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గారు అప్పటికప్పుడు దగ్గరలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు అందరితో అత్యవసర మీటింగును ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగుకు గాను కృష్ణా, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల నాయకులను వారి రాష్ట్ర కార్యాలయానికి ఈ అంశం పై చర్చించాడనికి జగన్ దిశా నిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. వారి మీటింగు తర్వాత రేపు వారు అసెంబ్లీకి హాజరు కావాలా? వద్దా? అన్న విషయం మీద స్పష్టత ఇస్తాము అని తెలిపారు. ఐతే వస్తున్న వార్తలు ప్రకారం, ఎవరైతే వై సి పి నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఎం.పి పదవులు కట్టబెట్టారో ఉన్నారో వారి అందరి మీద తగు చర్యలు తీసుకుంటేనే వారు రేపు జరగబోయే మీటింగుకు హాజరు అవుతామని లేకపోతే ససేమిరా అంటున్నారు అని తెలుస్తున్నది.

  •  
  •  
  •  
  •  

Comments