బౌలర్ క్యాచ్.. బ్యాట్స్ మెన్ షాక్!

Sunday, September 9th, 2018, 12:17:49 AM IST

క్రికెట్ ఆటలో అప్పుడప్పుడు జరిగే కొన్ని సన్నివేశాలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఫీల్డింగ్ సన్నివేశాలు ఒక్కోసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అదే విధంగా నవ్వును కూడా తెప్పిస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి ఒక వీడియో వైరల్ మారింది. బ్యాట్స్ మెన్ కొట్టిన బంతి ఊహించని విధంగా ఫీల్డర్ హెల్మెట్ కు తాకి బౌలర్ చేతిలో పడింది. దీంతో బ్యాట్స్ మెన్ పెవిలియన్ బాట పట్టాడు.

ఇంగ్లాండ్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో భాగంగా వార్‌విక్‌షైర్‌-దుర్హాం జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. అయితే భారత్‌ ఆటగాడు అక్షర్‌ పటేల్‌ దుర్హాం జట్టు తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే వార్‌విక్‌షైర్‌ ఆటగాడు రియాన్‌ సైడ్‌బోటమ్‌ సెకండ్ ఇన్నింగ్స్ లో విచిత్రంగా అవుటయ్యాడు. 66వ ఓవర్లో అక్షర్ పటేల్ వేసిన నాలుగో బంతిని ఎదుర్కొన్న రియాన్ లెగ్ సైడ్ కొట్టాడు. అయితే అక్కడే ఉన్న ఫీల్డర్ హెల్మెట్ కు తగిలి మళ్లీ తిరిగి బౌలింగ్ వేసిన అక్షర్ వద్దకు వచ్చింది. దాన్ని జాగ్రత్తగా పట్టుకోవడం బ్యాట్స్ మెన్ ఒక్క సెకండ్ షాక్ అయ్యాడు, అంపైర్ అవుట్ అని చెప్పకముందే బ్యాట్స్ మెన్ పెవిలియన్ బాటపట్టాడు.

  •  
  •  
  •  
  •  

Comments