వింత వివాహం..వివరాలు తెలిస్తే షాకే!

Friday, May 11th, 2018, 01:50:33 PM IST

బాల్య వివాహాలు పూర్వపు రోజుల్లో ఉండేవి. అయితే ప్రస్తుత కాలంలో కూడా నిరక్షరాస్యత, అవగాహనాలోపం వల్ల అక్కడక్కడా ఈ సాంఘిక దురాచారం జరుగుతోంది. ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన ఒక బాల్యవివాహం ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ దంపతుల మేటర్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. విషయంలోకి వెళితే, తండ్రి మద్యానికి బానిస కావడం, తల్లికి తీవ్ర అనారోగ్యంతో మంచాన పడడంతో తనకున్న ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు ఏమవుతుందో అనే బాధతో ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడి పెళ్లి చూసి చనిపోవాలని అనుకున్న తల్లి, వెనువెంటనే బంధువులకు చెప్పి ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం నిర్ణయించింది.

అయితే ఇందులో వింతయిన విషయం ఏమిటంటే ఆ పెళ్లికుమారుడి వయసు కేవలం 13 సంవత్సరాలు కాగా పెళ్లికుమార్తె వయసు 23 సంవత్సరాలు కావడం. వీరి వివాహానికి కౌతాళం మండలంలోని ఒక గ్రామం వేదిక అయింది. అయితే ఈ వింత వివాహానికి హాజరయిన కొందరు ఇరువైపులా పెద్దలను తిట్టిపోశారు. ఇది ఒక అవగాహనా రాహిత్యంతో చేస్తున్న వివాహమని, పెద్దలు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలకు పిల్లలను బలిచేస్తున్నారని నిందిస్తున్నారు. ఆ విషయం అటుంచితే జరిగిన వీరి వివాహం టాక్ అఫ్ ది స్టేట్ అయింది. ప్రస్తుతం ఈ వివాహం తాలూకు ఫోటోలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి…..

  •  
  •  
  •  
  •  

Comments