పెళ్లికూతురిని పెళ్లి చేసుకున్న పెళ్ళికొడుకు చెల్లి

Saturday, January 28th, 2017, 11:23:52 AM IST

marriage
తమిళనాడులో ఒక పెళ్లి విచిత్రంగా జరిగింది. పెళ్ళికొడుకు లేకుండానే పెళ్లి జరిగింది. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో ఈ పెళ్లి జరిగింది. పద్మనాభపురానికి చెందిన సోఫియాకు, పేచ్చిపరై కు చెందిన అజారుద్దీన్ కు కొద్దీ రోజులకు ముందు ముస్లిం సంప్రదాయం ప్రకారం నిశ్చితార్ధం జరిగింది. పద్మనాభపురంలోని ఒక కల్యాణ మండపంలో వీరిరువురి పెళ్ళికి ఏర్పాట్లు జరిగాయి. అజారుద్దీన్ సౌదీలో ఒక ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. గురువారం అజారుద్దీన్ ఇండియాకు వచ్చేందుకు కారులో సౌదీ విమానాశ్రయానికి బయలుదేరాడు. అయితే అతను వచ్చే దారిలో ట్రాఫిక్ జాం కావడంతో సకాలంలో విమానాశ్రయానికి చేరుకోలేకపోయాడు. దీంతో అతను ఇండియా వచ్చే విమానాన్ని మిస్ అయ్యాడు.

దీంతో ఇండియాలో ఉన్న అతని బంధువులు పెళ్లి సమయానికి అజారుద్దీన్ రాలేడని తెలిసినా ఏం కంగారు పడలేదు. అంతేకాదు అతను రాకపోయినా ఈ పెళ్లి ఆగదని, పెళ్లిని జరిపించి తీరుతామని వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పెళ్లికూతురు సోఫియా మేడలో పెళ్ళికొడుకు చెల్లి సూత్రధారణ చేసింది. పెళ్ళికి వచ్చిన వారు అందరూ వధువును ఆశీర్వదించి, కానుకలు ఇచ్చారు. ముస్లిం సంప్రదాయాల ప్రకారం వధువు, వరుడు అంగీకార పత్రాలపై సంతకాలు పెడితేనే సగం పెళ్లి అయిపోయినట్లని, కనుక సోఫియాకు జరిగింది పెళ్లిగానే పరిగణిస్తామని వారు అంటున్నారు.