జర్నలిస్ట్ ని ఉక్కిరిబిక్కిరి చేసిన అఖిలేష్ భార్య ..!

Tuesday, February 21st, 2017, 07:46:44 PM IST


యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి దెబ్బకు ఓ జర్నలిస్ట్ ఉక్కియి బిక్కిరి అయ్యాడు. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో అఖిలేష్ భార్య ఆజ్ తక్ జర్నలిస్ట్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. మహిలాల్ భద్రత కోసం జర్నలిస్టులుగా మీరెంత ప్రాధాన్యత ఇస్తున్నారని అఖిలేష్ సతీమణి డింపుల్ అతడిని ప్రశ్నించింది. యూపీ అత్యాచారాలపై జర్నలిస్తూ డింపుల్ ని ప్రశించినపుడు ఆమె అతడికి కౌంటర్ ఇచ్చింది. గుజరాత్ లోని కకచ్ జిల్లా నాలియాలో బిజెపి నేతలు కొందరు ఓ యువతి పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని కానీ మీడియా ఆ సంఘటనని హైలైట్ చేయలేదని విమర్శించింది.

ఉనాలో జరిగిన రేప్ ఘటనని తాము ప్రధానంగా పేర్కొన్నామని జర్నలిస్ట్ తెలపగా ముందు కచ్ ఘటన గురించి మాట్లాడండి అని పదే పదే అడిగింది. దీనితో ఆ జర్నలిస్ట్ మాట్లాడలేకపోయాడు. వీరి సంభాషణల్లో ఢిల్లీలో మహిళల పై జరుగుతున్న ఘటనలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.యూపీ లో ఓవైపు ఎన్నికలు జరుగుతుండగా జరిగిన వీరి సంభాషణ చర్చనీయాంసంగా మారింది.