డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికిన ప్రముఖ దర్శకుడు

Saturday, September 20th, 2014, 10:52:03 AM IST


ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి కుమార్ శుక్రవారం అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. కాగా శుక్రవారం అర్ధరాత్రి జూబ్లిహిల్స్ పోలీసులు వెంకటగిరి చౌరస్తాలో నిర్వహించిన తనిఖీల్లో బీవీఎస్ రవి మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్నట్లుగా గుర్తింఛి వెంటనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే రవితో పాటుగా వాహనంలో ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నట్లు సమాచారం. ఇక బీవీఎస్ రవి కుమార్ గతంలో కూడా ఇలా మద్యం తాగి డ్రైవ్ చేసిన కేసులో పట్టుబడగా అప్పుడు అతనితో ప్రముఖ నటుడు రవితేజా ఉన్నట్లుగా తెలియవస్తోంది. కాగా 2011లో విడుదలైన గోపీచంద్ ‘వాంటెడ్’ సినిమా దర్శకుడైన రవికుమార్ పరుగు, కింగ్, మున్నా, తులసి, పాండవులు పాండవులు తుమ్మెద, కెమరా మెన్ గంగతో రాంబాబు వంటి పలు పెద్ద చిత్రాలకు రచయితగా పనిచేశారు.