ఆ రచయితది ఆత్మహత్య కాదట..! మరి ఏంటో తెలుసా..?

Friday, May 18th, 2018, 03:33:17 PM IST

ప్రముఖ రచయిత, దర్శకుడు అయిన రాజసింహ ముంబాయిలోని ఓ రూమ్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంతో మానసిక క్షోభకు గురై అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకొని ఆత్మా హత్య చేసుకున్నాడని అన్నారు. అయితే తాజాగా రాజసింహ ఈ అంశంపై ఓ లైవ్ వీడియో ద్వారా బయటకి వచ్చారు. తను షుగర్ పేషంట్ అయినందున అకస్మాత్తుగా షుగర్ లెవల్స్ పెరగడంతో అనుకోకుండా స్పృహ కోల్పోయానని, అన్నాడు.
ఆ పరిస్థితిలో పక్కన ఎవ్వరూ లేకపోవడంతో నేను ఇంకా సీరియస్ అయ్యానని కానీ కాసేపటి తర్వాత సరైన సమయంలో దగ్గరలోని ఆసుపత్రికి చేరుకోగా ప్రాణాల నుండి బయట పడ్డానని, ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపాడు. అనవసరంగా ఇది తెలియకుండా నాపై అభాండాలు వేసి చేతికోచ్చినవి రాసి అందరినీ అయోమయంలో పాదేసారని బాధపడ్డాడు. ఇంకో రెండురోజుల్లో నేను తిరిగి హైదరాదాబ్ వచ్చి అందరితో మాట్లాడుతానని వెల్లడించాడు. 2016 లోనే హీరో సందీప్ కిషన్, నిత్యా మీనన్ నటీనటులుగా ఒక్క అమ్మాయి తప్ప అనే చిత్రాన్ని అందించి, వెనువెంటనే శంకర్ దాదా ఎంబీబీఎస్, బొమ్మరిల్లు, ఝుమ్మంది నాదం, అనగనగా ఓ ధీరుడు, రుద్రమా దేవి లాంటి పెద్ద చిత్రాలకు రచయితగా చేయడమే కాకుండా, దుద్రమాదేవి సినిమాలో ప్రేక్షకులతో విజిల్స్ వేయించిన అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రకి కూడా మాటలు రాసి మంచి పేరు తెచ్చుకున్నాడు. రచనా, దర్శకత్వంలోనే కాకుండా, టక్కరి దొంగ, స్నేహం, సంబరం వంటి చిత్రాలలో కూడా ఆర్టిస్టుగా నటించాడు.