హిట్ టాక్ వచ్చినా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు.!

Saturday, October 6th, 2018, 07:05:31 PM IST

మన టాలీవుడ్ లో కొన్ని చిత్రాలు వెండి తెర మీద హిట్ కాకపోయినా బుల్లితెర మీద హిట్ అవుతాయి కానీ,మరి కొన్ని చిత్రాలు మాత్రం వెండితెర మీద హిట్ టాక్ సంతరించుకున్నా సరే ఆ చిత్రాలని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకి మాత్రం నష్టాన్నే కలిగిస్తాయి.ఇప్పటి వరకు టాలీవుడ్ లో అలాంటి చిత్రాలను ఎన్నో చూసాము.ఇప్పుడు కూడా అదే కోవలోకి మరో రెండు చిత్రాలు చేరబోతున్నాయి.వినాయకచవితి సందర్భంగా విడుదలైన సమంతా చిత్రం యూటర్న్ ఈ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నా సరే ప్రేక్షకులు తమ డబ్బులు ఈ చిత్రం మీద వెచ్చించడానికి ఆసక్తి చూపించడం లేదు.

అంతే కాకుండా ఇటీవలే విడుదలైన నవాబ్ చిత్రంకు గాను మణిరత్నం ఈస్ బ్యాక్ అంటూ అభిమానులు సందడి చేసినా సరే సామాన్య ప్రేక్షకుడు మాత్రం ఈ చిత్రాన్ని లైట్ గానే తీసుకుంటున్నారు.దీనితో ఈ రెండు సినిమాల పరిస్థితి చాలా దారుణంగానే ఉంది.వైజాగ్ లో యూటర్న్ హక్కులను 1.15కోట్లకు కొనుగోలు చేయగా మొత్తానికి ఆ చిత్రం 70లక్షల దగ్గర ఆగిపోయింది.నవాబ్ పరిస్థితి కూడా అలాగే ఉంది.ఈ చిత్రాన్ని 40 లక్షలకు కొనుగోలు చేయగా వారం ముగిసే సరికి కేవలం 20 లక్షలు మాత్రమే రాబట్టగలిగింది.ఈ మిగతా 20 లక్షలు రాబట్టడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమే అని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు.