24 గంటల్లో టిక్కెట్ ఇవ్వకపోతే ఆత్మాహుతి చేస్కుంటా..!

Tuesday, September 11th, 2018, 12:56:58 PM IST

తెలంగాణా లో ముందస్తు ఎన్నికల మేరకు తెరాస పార్టీ తరపు నుంచి వారి యొక్క అభ్యర్థులకు సంబందించిన జాబితాను ముఖ్యమంత్రి కెసిఆర్ విడుదల చేసిన సంగతి తెలిసినదే. అయితే విడుదల చేసిన జాబితా పట్ల తెలంగాణా అభ్యర్థుల్లో తీవ్ర వ్యతిరేకతను చోటు చేసుకుంది కొంతమందికి తీవ్ర మనస్తాపాన్ని కూడా కలిగించింది. ఈ జాబితా అంతా కావాలనే కొంత మంది ముఖ్య నాయకుల చేత చేయిచబడింది అని టిక్కెట్ రాని అభ్యర్థులు వాపోతున్నారు. మరికొంత మంది యొక్క అనుచరులు నిరసనలు చేపట్టారు.

అయితే ఇందులో భాగంగానే ఈ చర్య కొంచెం తీవ్ర రూపం దాల్చేలా ఉంది.. మంచిర్యాల జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కెసిఆర్ విడుదల చేసిన అభ్యర్థుల లిస్ట్ లో తన పేరు లేదు అని తీవ్ర మనస్తాపానికి గురి అయ్యారు. ఆయన దీనికి నిరసన గాను తన కుటుంబం సహా స్వగృహ నిర్బంధం చేసుకున్నారు.. తనకు టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమని, తనకి గనుక 24 గంటల్లోపు ముఖ్యమంత్రి కెసిఆర్ టిక్కెట్ గాని ఇవ్వని పక్షంలో తాను తన కుటుంబం తో సహా తన గృహం లోనే ఆత్మాహుతి చేసుకుంటాం అని హెచ్చరించారు. దీనికి మరి కెసిఆర్ గారు ఎలా స్పందిస్తారో చూడాలి..

  •  
  •  
  •  
  •  

Comments