కసి తీర్చుకున్న బ్రేవో.. వరుసగా 5 సిక్సర్లు!

Sunday, September 2nd, 2018, 07:20:21 PM IST

వెస్టిండీస్ క్రికెటర్లు బంతులను ఎంత భయంకరంగా కొడతారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక్కసారి గ్రౌండ్ లో నిలదొక్కుకున్నారు అంటే చాలు ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా సరే తల పట్టుకోవలసిందే. ఇక క్రికెట్ ను ఆస్వాదించే ఆడియెన్స్ కు మంచి కిక్కు ఉంటుంది. ఆ విధంగా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే ఆటగాల్లో డ్వెన్ బ్రేవో ఒకరు. రీసెంట్ గా ఈ ఆల్ రౌండర్ కరేబియన్ క్రికెట్ లీగ్ లో తన అసలైన బలాన్ని చూపించాడు.

ఒక్క బంతి మిస్సయ్యింది అన్న కోపంతో ఆ తరువాత వరుసగా 5 బంతులను సిక్సర్లుగా మలిచాడు. నైట్‌ రైడర్స్‌ తరపున ఆడుతున్న బ్రేవో ఇటీవల సెయింట్‌ కిట్స్‌తో జరిగిన టీ 20 మ్యాచ్‌లో అసలైన క్రికెట్ మజాను చూపించాడు. జోసెఫ్ వేసిన 19వ ఓవర్ లో మొదటి బాల్ మిస్ అయ్యింది. దీంతో కొంచెం అసహనానికి లోనైన బ్రేవో అనంతరం 5 బంతులను సిక్స్ లుగా మలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 11 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్సర్లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచిన బ్రేవో జట్టు స్కోరును 199కి తీసుకువచ్చాడు. ఇక తరువాత సెయింట్‌ కిట్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

  •  
  •  
  •  
  •  

Comments