గద్వాల్ రాణి చేయబోయే పనికి సోనియా దిమ్మ తిరగడం ఖాయం..!!

Saturday, October 14th, 2017, 05:39:09 PM IST

గద్వాల్ జేజెమ్మ, రాణి గా పేరుగాంచిన కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ ఎప్పుడూ మీడియాలో హై లైట్ అయ్యేవారు. టి కాంగ్రెస్ ఏ కార్యక్రమం నిర్వహించినా మహిళా నేతల్లో డీకే అరుణ ముందుండేవారు. ప్రజా సమస్యలపై పోరాడే విషయంలో ఆమె కేసీఆర్ పై ఒంటి కాలిపై లేచి తీవ్రమైన విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. టి కాంగ్రెస్ లో అంతలా ప్రభావం చూపిన డీకే అరుణ సైలెంట్ అయిపోవడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా డీకే అరుణ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సంచారం ప్రకారం.. సొంత పార్టీకి అరుణ భారీ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

కారు ఎక్కి గులాబితీర్థం పుచ్చుకోవడంపై ఆమె తన అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టిఆర్ ఎస్ పార్టీ జోరు కొనసాగుతుండడంతో తెలంగాణలో మరో పార్టీ కోలుకునే సూచనలు కనిపించడం లేదు. ఈ అభిప్రాయాన్నే అరుణ తన అనుచరులకు వివరించినట్లు తెలుస్తోంది. గద్వాల ప్రాంతంలో డీకే అరుణకు మంచి పట్టు ఉంది. ఎక్కువకాలం అధికారం లేకపోతే పట్టు కోల్పేయే ప్రమాదం ఉందని డీకే అరుణ భావిస్తున్నారట. ఎలాగైనా టిఆర్ ఎస్ పార్టీలో చేరి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు. దానం నాగేందర్ కూడా టిఆర్ ఎస్ లో చేరే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కీలక నేతలు జంప్ అయితే కాంగ్రెస్ అధిష్టానానికి పంచ్ పడ్డట్లే. ఏపీలో ఎలాగూ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయింది. తెలంగాణాలో పార్టీకి అండగా సీనియర్ నేతలు ఉన్నారులే అనే ధీమా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలో ఉంది. వారు కూడా జారుకుంటే కాంగ్రెస్ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments