ఈ సీఎం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమే తప్ప లాభం లేదు – డీఎల్

Friday, June 7th, 2013, 01:00:50 PM IST

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయమని మాజీ మంత్రి డీల్ రవీంద్ర రెడ్డి అన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత సొంత నియోజక వర్గానికి వచ్చిన ఆయన భారీ వాహన ర్యాలీని నిర్వహించాడు. కర్నూల్ సరిహద్దు ప్రాంతంలో గల చాగలమర్రి సమీపంలో అయన ప్రసంగంలో మాట్లాడుతూ 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టికి తను సేవచేస్తే ఈనాడు ఎటువంటి విచారణ జరపకుండా తనని బర్తరఫ్ చేశారని అన్నాడు. 1983 నుండి నేను వైస్ రాజశేఖర్ రెడ్డి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాము. పార్టీ క్రమశిక్షణ ఏనాడు ఉల్లంఘించలేదు. ఇప్పటివరకు నా పై ఎలాంటి మచ్చలేదన్న ఆయన కుంభకోణాల్లో ఇరుకొన్న వారిని పిలిచి వివరణ అడిగి రాజీనామాలు కోరిన ముఖ్యమంత్రి తమని ఎందుకు పిలలేదని ప్రశ్నించారు. అధికారం కోసం తను ఏనాడూ ఆశపడలేదని, సిఎం ఒక్క పోన్ చేసి రాజీనామా చేయమంటే నేనే చేసేవాడినని అన్నారు. తన నియోజక వర్గంలో 2 సార్లు ఓడిపోయినా కిరణ్ లాంటి వారు కొద్ది రోజులు పదవిలో వుండి కోట్లు సంపాదించుకుంటరే గాని వీరివల్ల పార్టికి ఎటువంటి లాభం ఉండదు. అంతేకాకుండా పార్టీకి ముప్పువాటిల్లే ప్రమాదం వుందని అయన అన్నాడు.