వేధింపులకు పాల్పడిన కీచక వైద్యాధికారి…..ఏమి జరిగిందంటే?

Thursday, April 19th, 2018, 09:00:04 PM IST


ఇటీవల మహిళల పై లైంగిక వేధింపులు మరీ శృతిమించాయి. వయో బేధం లేకుండా ఆఖరికి చిన్న పిల్లల్ని కూడా మృగాళ్లు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటే మన మనిషి బ్రతుకు ఎంతగా దిగజారిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇటీవల ఒక వైద్యాధికారి తనను వేధిస్తున్నాడంటూ ఉద్యోగిని ఆయనపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాధు చేసింది. విషయం లోకి వెళితే, ఖమ్మం జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో) తనను లైంగికంగా వేధిస్తున్నాడని కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సు గురువారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తనను శారీరకంగా లొంగదీసుకోవడానికి డీఎంహెచ్‌వో కొండలరావు ప్రయత్నించారని, ఇందులో భాగంగా తనను లైంగికంగా వేధిస్తూ, తన కోరిక తీర్చకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తానని బెదిరిస్తున్నారని బాధితురాలు వాపోయింది.

కీచకంగా ప్రవర్తిస్తున్న అధికారి బారి నుంచి కాపాడి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా దళిత, బహుజన సంఘాలతో కలిసి ఖమ్మంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. డీఎంహెచ్‌వో వేధింపులు తట్టుకోలేని బాధితురాలు బుధవారం మానవ హక్కుల కమిషన్‌ ను కూడా ఆశ్రయించింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, కోరిక తీర్చు, లేకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తా వ్యభిచారం కేసు పెట్టిస్తా అని కొండలరావు వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇకనైనా ఆయన బారి నుండి తనని కాపాడి, తనకు రక్షణ కల్పించాలని అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments