కాంగ్రెస్ లో విలీనం అయ్యే సమస్యే లేదు… కోదండరాం

Saturday, January 12th, 2019, 05:30:47 PM IST

ఆసక్తికర వార్తలు చేసి మరోసారి వార్తల్లో నిలిచిపోయాడు ప్రొఫెసర్ కోదండరాం… రాజకీయ నాయకులందరూ కూడా తమ బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుతున్నారని కోదండరాం అన్నారు. ఒకప్పుడు ఉన్న రాజకీయాలు ఇప్పుడు లేవని, అందరు కూడా తమ స్వార్థం చూసుకుంటున్నారని కోదండరాం ఏడవ చేశారు. తెలంగాణాలోజరిగిన ఎన్నిలకల్లో ఓటమి పై అసలు ఇంత వరకు ఎలాంటి చర్చ కూడా కూటమిలో జరగలేదని, ఎవ్వరు కూడా ఓటమిపై స్పందించడం లేదని కోదండరాం తెలిపారు.

అంతేకాకుండా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడమా లేదా అనే విషయం పైన కూటమి ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని, ముతమైనాయకులు కూడా దీనిపై ఎం స్పందించడంలేదని కోదండరాం ఆరోపించారు. రానున్న ఎన్నికలపై తమ పార్టీకంటూ అంతర్గతంగా ఓ ఆలోచన ఉందన్నారు. తెలంగాణ జనసమితి ఎట్టి పరిస్థితిల్లోనూ కాంగ్రెస్‌లో విలీనం కాదని స్పష్టం చేశారు. తెలంగాణా ఏన్నికల్లో ఓటమి పాలైనందుకు ఎలాంటి నిరాశకి లోనవ్వలేదని, రానున్న పార్లమెంటు ఎన్నికలకి సిద్ధంగా ఉన్నామని కోదండరాం స్పష్టం చేశారు. పార్టీ స్థాపించిన కొద్దీ రోజుల్లోనే ఎన్నికలు రావడంతో, ప్రజలతో అంత త్వరగా మమేకం కాలేదని, అందుకనే ఓటమి పాలయ్యామని తెలిపారు.