ఈ కారు నెంబర్ ప్లేట్ ఖరీదు ఎన్ని వందల కోట్లో తెలుసా..?

Tuesday, April 10th, 2018, 06:31:06 PM IST

సాదారణంగా వాహన ప్రియులకు కార్లన్నా, డిఫరెంట్ మాడల్ హాయ్ స్పీడ్ బైక్లాన్నా చచ్చేంత పిచ్చి ఉండటం చూస్తూనే ఉంటాం. కాగా మన దేశంలో కొత్తగా కారు కొంటే కార్ల ఫ్యాన్సీ నెంబర్‌ ప్లేట్‌ కోసం లక్షలు ఖర్చు పెట్టడం కూడా వినే ఉంటారు. ఇంకొందరైతే కొన్న కారు కంటే దాని నంబర్ కోసం పెట్టె ఖర్చే ఎక్కువుంటుంది. అలాగే ఇక్కడ ఓ పెద్ద వింత జరిగింది. ఇటివల బ్రిటన్‌లో అమ్మకానికి పెట్టిన ఓ కారు నంబర్‌ ప్లేట్‌ ఖరీదెంతో తెలిస్తే కళ్ళు గిరగిరా తిరిగి చక్కర్లు రావాల్సిందే. ఇన్ని చెప్తున్నాం ఇంతకీ ఆ నంబర్ ఏంటా.. దాని స్పెసలిటీ ఇంతా అనుకుంటున్నారా..? అవును మరి కేవలం ‘ఎఫ్‌ 1’ అనే టూ డిజిట్‌ కస్టమైజ్డ్‌ నంబర్‌ ప్లేట్‌ ఖరీదు అక్షరాలా రూ.132 కోట్లు. ఒకవేళ అమ్ముడుపోతే, ప్రపంచంలో అత్యంత ఖరీదైన నంబర్‌ ప్లేట్‌ ఇదే కానుంది. ఇది వింటే కదా మరి.. గతంలో దుబాయ్‌లో ‘డి 5’ అనే రెండక్షరాల నంబర్‌ ప్లేట్‌ను వేలంపాటలో పాడగా బల్విందర్‌ సహానీ అనే భారతీయ వ్యక్తి దాన్ని రూ.67 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పడు ఈ నెంబర్ ఇంతకు అమ్ముడు పోతుందా అన్న విషయం ఇక వేచి చూడాల్సిందే. ముందు ఆ కారుపై మీరూ ఓ లుక్కేయండి మరి.