ఉమెన్స్ డే ఓకే.. మరి మెన్స్ డే ఎప్పుడో తెలుసా..?

Thursday, March 8th, 2018, 08:30:15 AM IST

అందరు ఇవాళ్ళ మహిళా దినోత్సవాన్ని పండగలా జరుపుకుంటున్నారు, సోషల్ మీడియాలో మహిళలపై స్పెషల్ గా కొటేషన్లు, కామెంట్లు, పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. అంతా బాగానే ఉంది మరి ఇంటర్నేషనల్ మెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా. కదా ఇది మాత్రం చాల మందికి తెలియక పోవచ్చు. నవంబర్ 19వ తేదీన అంతర్జాతీయ మెన్స్ డేను జరుపుకుంటున్నారట. ఈ ఈవెంట్‌ను సుమారు 70 దేశాలు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నాయి. మెన్స్ డే కోసం ఈ ఏడాది థీమ్‌ను పాజిటివ్ మేల్ రోల్ మాడల్స్ అని క్రియేట్ చేశారు. ఓ ఆదర్శ పురుషుడిని ఆదర్శంగా తీసుకుని పిల్లలు ఎదగాలని మెన్స్ డే ఆర్గనైజర్లు తెలిపారు. ఇంటర్నేషనల్ మెన్స్‌డే కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఉంది. పురుషుల, అబ్బాయిల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ఆ సైట్‌లో ఆర్గనైజర్లు కోరారు. స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలను బలపరచడం, లింగ సమానత్వం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు. 1960 నుంచి మెన్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. వచ్చే మెన్స్ డే కి మరి ఏం చేస్తారో చూద్దాం..!