ఐపీఎల్ కి కొత్త స్పాన్సర్… స్పాన్సర్షిప్ ఖర్చు ఎంతో తెలుసా..?

Monday, March 12th, 2018, 07:16:28 PM IST

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వ్యాపార వేత్తలకు, క్రికెట్ అభిమానులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ టైటిల్ కొత్త స్పాన్సర్‌ని బీసీసీఐ ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 4 నుంచి ఐపీఎల్ 11వ సీజన్ అట్టహాసంగా ప్రారంభంకానుంది. అయితే వచ్చే ఐదేళ్లు టైటిల్ స్పాన్సర్‌‌గా పేటీఎం వ్యవహరించనున్నట్లు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. ‘‘పేటీఎం ఇండియన్ క్రికెట్‌కు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ప్రస్తుతం ఈ సంబంధాలు ఈ ఏడాది ఐపీఎల్‌కు కొనసాగుతున్నాయి. పేటీఎం, బీసీసీఐ రెండు సత్సంబంధాలు ముందుకు కొనసాగనున్నాయి. పేటీఎంకు బీసీసీఐ గొప్ప విలువ ఇస్తుంది’’ అని రాజీవ్ అన్నారు. అనంతరం పేటీఎం వ్యవస్థాపకుడు, ఛైర్మన్ విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్‌కు పార్ట్‌నర్‌గా ఉండటం ఎంతో సంతోషంగా ఉంది. పేటిఎం ఎదుగుదలలో క్రికెట్ ఓ కీలక పాత్ర పోషించింది. మాకు బీసీసీఐతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ ఏడాది ఐపీఎల్‌లో మా పెట్టుబడులు మా నిబద్ధతను మరింత బలపరుస్తుంది అని భావిస్తున్నా’’ అని అన్నారు. ఇక భారత క్రికెటర్లు ఆటను అద్భుత రీతిలో ఆడి అవార్డులను, రివార్డులను గెలుపొంది భారత్ కు మరింత మంచి పేరు తేవాలన్నారు.

గత సీజన్‌ కోసం వివో సంస్థ రూ.100 కోట్లతో టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను దక్కించుకుంది. గతంలో డిఎల్‌ఎఫ్, పెప్సీకో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్లుగా వ్యవహరించాయి. కాగా 2018 సీజన్ నుంచి 2022 వరకూ పేటీఎం సంస్థ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ని రూ.439.8 కోట్ల వెచ్చించి దక్కించుకున్నట్లు సమచారం.

  •  
  •  
  •  
  •  

Comments