ఇండియన్ యంగ్ బిలీనియర్ ఎవరో తెలుసా..?

Wednesday, March 7th, 2018, 07:10:21 PM IST

తాజాగా ప్రపంచంలో ఎంతమంది కుబేరులు ఉన్నారు అని సర్వే చేయగా అమెజాన్ సంస్థ సిఈఓ. మొదటి స్థానంలో ఉండగా ముకేష్ అంబాని భారత్లో మొదటి స్థానంలో నిలిచాడు. అయితే భారత్ లో పేటీయం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌‌ శర్మ భారత యువ కుబేరునిగా నిలిచాడు. ఇక భారత్‌లో అత్యంత వృద్ధ కుబేరునిగా ఎమెరిటస్‌ అల్కేమ్‌ లాబొరేటరీస్‌ ఛైర్మన్‌ అయిన 92 ఏళ్ల సంప్రదాసింగ్‌ ఉన్నారు. ఈ వివరాలను ఫోర్బ్స్‌ వెల్లడించింది.

1.7 బిలియన్‌ డాలర్లతో పేటీఎం అధినేత 1,394వ ర్యాంక్‌లో నిలిచారు. ఇక భారత్‌ నుంచి 40 ఏళ్లలోపు వయసున్న బిలియనీర్‌ ఆయన ఒక్కరే అవ్వడం విశేషం. 2011లో పేటీఎం సంస్థను విజయ్‌ శేఖర్‌ శర్మ స్థాపించారు.అనంతరం వ్యాపారాన్ని విస్తరించి.. పేటీఎం మాల్‌, ఈకామర్స్‌ బిజినెస్‌, పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లను సృష్టించారు. భారత్‌లో అప్పుడే డిమానిటైజేషన్ కావడం వాళ్ళ నోట్ల రద్దు అయింది, అప్పుడే అభివృద్ధి చెందుతున్న పేటీయం పెద్దనోట్ల రద్దు అనంతరం ఎక్కువగా లాభపడింది. ఆ సమయంలో 250 మిలియన్‌ రిజిస్టర్‌ యూజర్లతో రోజుకు 7 మిలియన్ల లావాదేవీలు జరిగాయి అంటే ఆషామాషీ కాదు. శర్మకు పేటీఎంలో 16 శాతం వాటా ఉంది. ఇప్పుడు పేటీఎం విలువ 9.4 బిలియన్‌ డాలర్లకు చేరింది అని తాజాగా ఫోర్బ్స్‌ పత్రిక వెల్లడించింది.

ఫోర్బ్స్‌ జాబితాలోని మొత్తం 2,208 బిలియనీర్లలో 40 ఏళ్లలోపువారు కేవలం 63 మంది ఉన్నారు. వీరి మొత్తం సంపద 265 బిలియన్‌ డాలర్లు కాగా, గత ఏడాది(208 బిలియన్‌డాలర్లు)తో పోల్చుకుంటే ఇది చాలాఎక్కువ.

ఇక ఎమెరిటస్‌ అల్కేమ్‌ లాబొరేటరీస్‌ ఛైర్మన్‌ అయిన 92 ఏళ్ల సంప్రదాసింగ్‌ భారత్‌లో వృద్ధ బిలియనీర్‌గా నిలిచారు. 1.2 బిలియన్‌ డాలర్ల సంపదతో 1,867వ స్థానంలో ఆయన ఉన్నారు. మళ్ళీ ఏడాది వచ్చే సరికి ఈ యువ బిలీనియర్ ఎన్నవ స్థానంలోకి వస్తాడో వేచి చూడాలి..!