దమ్ముంటే హరీష్ రావు ని సీఎం చేయండి… రేవూరి ప్రకాష్ రెడ్డి

Friday, November 9th, 2018, 04:51:57 PM IST

తెరాస నాయకులకి ప్రకాష్ రెడ్డి ఒక సవాల్ విసిరాడు. మీకు దమ్ముంటే రాబోయే ఎన్నికలలో గెలిస్తే కెసిఆర్ కి బదులు హరీష్ రావు ని సీఎం చేస్తానని మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయండి అని సవాల్ విసిరాడు. అసలు మీకు ఆలా హరీష్ రావు ని సీఎం గ ప్రకటించేంత దమ్ము ఉందా అని హన్మకొండ భవానీనగర్‌లోని టీడీపీ ఉమ్మడి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకవేళ అలా కేటీఆర్‌ ప్రకటిస్తే ఇంతకు ముందు తాను హరీశ్‌ రావు విషయంలో చేసిన వ్యాఖ్యలను విరమించుకుంటానని ప్రకటించారు. చంద్రబాబునాయుడును వెన్నుపోటు దారుడు అనడం, సూటి పోటీ మాటలతో తిట్టడాన్ని తీవారంగా ఖండించారు. ఇది తెరాస పాలకుల దిగజారుడు తనానికి నిదర్శనంగా పేర్కొన్నారు. ప్రకాష్ రెడ్డి కేటీఆర్‌ను పిల్లకాకిగా, రాజకీయం తెలియని వాడిగా, చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. 1995లో డీసీసీబీ ఎన్నికలకు సంబంధించి వరంగల్‌, ఆదిలాబాద్‌, నల్లగొండ, మెదక్‌ జిల్లాల్లో కేసీఆర్‌, నగేశ్‌, కడియం శ్రీహరి, దయాకర్‌రావు, మాధవరెడ్డి అన్నగారి ఆదేశాలకు వ్యతిరేకంగా పని చేశారన్నారు. వీరంతా ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్నారని గుర్తు చేశారు. ఎన్‌టీఆర్‌ తమను సస్పెండ్‌ చేయకుండా చూడాలని చంద్రబాబును వైస్రాయి హోటల్‌కు తీసుకువెళ్లారని, బాబు తన వంతు ప్రయత్నం చేస్తుండగానే ఎన్‌టీఆర్‌పై చెప్పులు వేయించింది కేసీఆరేనని వివరించారు. చరిత్రను వక్రీకరిస్తే చరిత్ర హీనులవుతారని హెచ్చరించారు.
1995 ఆగస్టులో ఈ సంఘటన జరిగితే 2001వరకు కేసీఆర్‌ మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా ఎందుకు ఉన్నాడని ప్రశ్నించారు. 1200మంది అమాయకుల బలిదానంవల్ల వచ్చిన తెలంగాణాను కేసీఆర్‌ కుటుంబంలోని నలుగురే పరిపాలించుకుంటా, అనుభవిస్తున్నారన్నారు. నాలుగు కోట్ల ప్రజలను వెన్నుపోటు పొడిచింది ఈ నలుగురేనన్నారు. ఇప్పుడు హరీశ్‌ రావుకు వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. కేటీఆర్‌, కవిత అమెరికాలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు అండగా ఉన్న హరీశ్‌ రావును పార్టీనుంచి దూరం చేసేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారన్నారు. కేటీఆర్‌కు ఉన్న రాజకీయ అనుభవం ఎంత? నీటి పారుపాదల శాఖను ఆయన సమీక్షిస్తారా? అని నిలదీస్తారు. చంద్రబాబునాయుడును కార్నర్‌ చేసి లబ్దిపొందాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రకాశ్‌రెడ్డి హెచ్చరించారు. హరీశ్‌రావు తనను ఏకపక్షంగా సంబోధించడాన్ని తప్పుబట్టారు. హరీశ్‌రావు వయసు తన రాజకీయ అనుభవం అంత లేదన్నారు. హరీశ్‌ రావు అధికార అహం తలకెక్కి మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు తమ వైఖరిని మార్చుకోకపోతే ప్రజలే వారిని రాజకీయంగా సమాధి చేస్తారన్నారు. వచ్చే ఎన్నికలపై విజయ ధీమా వ్యక్తం చేసారు.

  •  
  •  
  •  
  •  

Comments