ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్ చిందులు..చివరికి..

Saturday, June 2nd, 2018, 12:34:21 PM IST

వైద్యుల కంటే ఈ ప్రపంచంలో కనిపించే దైవం మరొకరు లేరని అంటుంటారు. ఏ దేశంలో అయినా ఏ మతం వారయిన వైద్యులు ప్రాణాలు కాపాడితే దైవంలా కొలుస్తారు. కానీ కొన్ని సార్లు ఆపరేషన్స్ చేసే ముందు చాలా మంది భయాందోళనకు గురవుతారు. అందుకే డాక్టర్స్ వారితో సన్నిహితంగా ఉండడటానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కువగా టెన్షన్స్ తీసుకోకుండా జాలిగా ఉండేలా కౌన్సలింగ్ ఇస్తుంటారు. సరదగా మాటల్లో కలిపి రోగి ని ఉత్తేజపరుస్తారు. అయితే రీసెంట్ గా ఓ వైద్యురాలు అదే చేయాలనీ అనుకుందో ఏమో గాని హ్యాపినెస్ డోస్ కొంచెం గట్టిగానే పెంచింది.

ఎంతగా అంటే ఆపరేషన్ అని మరచిపోయి ఎదో పబ్ డ్యాన్సులు చేసినట్లు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వీడియో బయటకు రావడంతో ఆమెపై చర్యలు తీసుకున్నారు. అసలు విషయంలోకి వెళితే.. డా.విండెల్‌ బోట్టె అనే వైద్యురాలు తన వద్దకు వచ్చిన ఒక రోగికి ఆపరేషన్ చేయడానికి సిద్ధమైంది. అయితే ఆమె సాధారణంగా చేయకుండా గెంతుతూ పాటపాడుతూ ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేసింది. ఆమెతో పాటు నర్సులు ఇతర డాక్టర్స్ కూడా స్టెప్పులు వేశారు. అది ఒక నర్సు వీడియో తీయగా సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. దీంతో వైద్యురాలి పై కఠిన చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ సంబంధిత అధికారులకు ఆదేశాలు అందాయి. రోగిని సంతోషంగా ఉంచడానికి మరి ఈ లెవెల్లో ఉండాల్సిన అవసరం లేదని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments