‘అమ్మ’ పేరెత్తగానే డాక్టర్ ని ఎందుకు అరెస్టు చేసినట్టు..?

Sunday, February 26th, 2017, 11:45:08 AM IST


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి సంబంధించి రోజుకోవార్త బయటకు వస్తోంది.అపోలో ఆసుపత్రి వర్గాలే పూటకో మాట చెబుతూ ప్రజలను గందరగోళంలోకి నెట్టుతున్నాయి.జయలలిత మరణంపై అనుమానాల్ని వ్యక్తం చేసిన డాక్టర్ రామ సీతను చెన్నై పోలీస్ లు శనివారం అరెస్టు చేశారు. జయ మరణంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన వారిలో రామ సీత కూడా ఉన్నారు.

ఓ డాక్టర్ గా జయ మరణంపై తనకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని అన్నారు. జయలలితని ఆసుపత్రికి తీసుకుని వచ్చే సమయంలో ఆమె అసలు స్పృహలోనే లేరని డాక్టర్ రామ సీత అన్నారు. ఈ సందర్భంగా రామ సీత శశికళ వ్యతిరేక వర్గం అయిన పన్నీర్ సెల్వం, జయ మేనకోడలు దీపని కలసి మద్దత్తు తెలిపారు. జయలలిత చికిత్స పొందే గదివైపు ఏ ఒక్క డాక్టర్ ని కూడా అనుమతించలేదని రామ సీత అన్నారు. తనకు జయ మరణం పై అనేక అనుమానాలు ఉన్నాయని ఆమె ప్రకటించడంతో పోలీస్ లు అరెస్టు చేసారు.జయలలిత మరణంపై మాట్లాడిన ఓ డాక్టర్ ని అరెస్ట్ చేయడంతో అనుమానాలు మరింత పెంచేలా ఉన్నాయి. కానీ పోలీస్ లు మాత్రం రామ సీత అసలు డాక్టరే కాదని వాదిస్తున్నారు. వివిధ సెక్షన్ ల కింద ఆమె పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.