శాడిస్ట్ మొగుడి షాకింగ్ సీక్రెట్స్ బయట పెట్టిన డాక్టర్ సమరం !

Wednesday, December 6th, 2017, 08:51:47 AM IST

నూతన వధువుపై తొలిరాత్రే దాడికి దిగిన శాడిస్ట్ మొగుడి గురించి వార్తలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాజేష్ అనే వ్యక్తి తొలి రాత్రే భార్యతో దారుణంగా ప్రవర్తించడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. రాజేష్ ఉదంతంపై మహిళా సంఘాలు పెద్దఎత్తున భగ్గుమంటున్నాయి. పెద్దలు పెళ్లి చేసే ముందు కొంచెం కూడా ఆలోచించరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై డాక్టర్ సమరం తనదైన శైలిలో స్పదించారు. రాజేష్ నపుంసకుడంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కేసుని మనం నపుంసకత్వం కోణంలో చూడకూడదని అన్నారు. తొలి రాత్రి రాజేష్ సైకో లాగా ప్రవర్తించాడని ఇది అత్యంత హేయమైన చర్య అని సమరం అన్నారు. తొలిరాత్రి భార్యతో తాను నపుంసకుడని రాజేష్ చెప్పడంపై సమరం స్పదించారు. ఒకటి అతడిలో ఆత్మవిశ్వాసం అయినా లోపించి ఉండాలి లేదా పెళ్ళికి ముందే వేరే మహిళతో శారీరక సంబంధం పెట్టుకుని ఆమె వద్ద సంసారానికి పనికిరావనే ముద్ర వేయించుకుని అయినా ఉండాలి అని అన్నారు. ఈ రెండు కారణాల వలనే ఈ ఘటన జరిగి ఉంటుందని సమరం అభిప్రాయ పడ్డారు. అతడిలో సైకలాజికల్ డిజాస్టర్ ఉందనే విషయం మనం అర్థం చేసుకోవాలని సమరం అన్నారు. అతడి లైంగిక పటుత్వంపై అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో అతడికి లైంగిక సామర్థ్య పరీక్షలు చేయడానికి సిద్ధం అవుతున్నారు.

దీని వలన ఎటువంటి ప్రయోజనం ఉండదనేది సమరం వాదన. లైంగిక పటుత్వ పరీక్షల్లో కేవలం హార్మోనులకు పరీక్ష నిర్వహిస్తారని అన్నారు. ఇది ఎక్కువ భాగం నార్మల్ అనే వస్తుందని సమరం అంటున్నారు. కానీ ఇది పెర్ఫామెన్స్ కు సంబంధించిన సమస్య అని అన్నారు.