ఒక గ్రూపుకు బదులు వేరే గ్రూపు రక్తం ఎక్కించడంతో…..

Wednesday, June 13th, 2018, 04:15:53 PM IST

కులమతాలకు అతీతంగా మనకు జబ్బు చేసినపుడు అందరికీ సమానంగా వైద్యసహాయం అందిస్తారు కాబట్టే డాక్టర్ ను దేవుడంటారు. కానీ ఇటీవల కాలంలో కొందరు డాక్టర్లు కేవలం తృచ్చమైన డబ్బుకోసం పేషంట్ల కు సకాలంలో, సరైనవిధంగా వైద్యం చేయకుండా, అశ్రద్దతో వ్యవహరించి పలువురి ప్రాణాలు బలిగొన్న ఘటనలు దేశంలో అక్కడక్కడా చూస్తున్నాం. వివరాల్లోకి వెళితే, ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా లో జరిగింది. కొద్దిరోజుల క్రితం 31ఏళ్ళ ఒక మహిళకు శస్త్ర చికిత్స నిమిత్తం ఆమె భర్త నగరంలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే శస్త్ర చికిత్సకు ఉపక్రమించిన డాక్టర్లు ఆమెకు ఒక గ్రూపు రక్తానికి బదులు వేరే గ్రూపు ఎక్కించడంతో ఒక్కసారిగా ఆ మహిళ కొట్టుమిట్టాడింది.

తరువాత చాలాసేపటి తమ తప్పు తెలుసుకున్న డాక్టర్లు చివరకు విషయాన్నీ ఆమె భర్తకు తెలపడంతో అతడు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాడు. అయితే అప్పటికే మహిళ శరీరం రంగు చాలా వరకు మారడం, ప్రధాన అవయవాలైన లీవర్, కిడ్నీ లు పూర్తిగా దెబ్బతిని, నరాలు కూడా చాలా వరకు చచ్చుబడడంతో మహిళ కనీసం కదల్లేని స్థితిలోకి వెళ్లిపోయింది. డార్క్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆమె శరీరం అంతకంతకు పట్టుకోల్పోతోందని, ఈ విషయమై వారిని నిలదీస్తే తనతో వాగ్వివాదం పెట్టుకున్నారని అతడు వాపోయాడు. అంతేకాక హాస్పిటల్ బిల్లు కూడా 2లక్షలకు పైగా చెల్లించానని, అయినప్పటికీ మరింత చెల్లించాలని, లేకపోతే తన భార్యను పట్టించుకోమని బెదిరిస్తున్నట్లు తెలిపాడు. ఈ విషయమై ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశానని, ఆవిడ కనికరించి నా భార్య ప్రాణాలు కాపాడాలని అతడు అభ్యర్థిస్తున్నాడు…..

  •  
  •  
  •  
  •  

Comments