జగన్ ను మార్చేసిన దాడి..?

Thursday, November 1st, 2018, 01:04:31 PM IST

స్వతహాగా కాస్త దూకుడు స్వభావి అయిన వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిలో ఇటీవల చాలా మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది. తానూ పాల్గొంటున్న పాద యాత్ర లో పలు విషయాల పై అయన స్పందిస్తున్న తీరు చుస్తే అది స్పష్టం అవుతుంది, ప్రతి విషయాన్నీ లోతుగా విశ్లేషించాకే దానిపై స్పందిస్తున్నారు. తాజాగా అతని పై విశాఖ విమానాశ్రయం లో హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో అయన ట్విట్టర్ లో అభిమానులు సమన్వయంగా ఉండాలంటూ సందేశం ఇవ్వటం మినహాయించి, వెంటనే స్పందించకుండా వారం రోజులు ఆగి స్పందించాడు. వారం రోజుల పాటు జరిగిన సంఘటనలని పరిశీలించి వాటిని తన పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ విషయం లో ప్రభుత్వం కుట్ర ఉందంటూ ఆరోపించడం చాలా తేలిక, కానీ అయన అలా ఆరోపించలేదు. దీనిని బట్టి చుస్తే జగన్ లో పరిణితి మరింత పెరిగినట్టు కనిపిస్తుంది,

తాజాగా జగన్ వేసిన పిటీషన్ లో దాడి జరిగిన తరువాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర డీజీపీ సహా ఇతర టీడీపీ నాయకులు అన్న మాటలను, ఈ దాడికి ఆపరేషన్ గరుడతో ముడి పెట్టిన వైనాన్ని, దాడిని తక్కువ చేసి చూపించటానికి వారు చేసిన ప్రయత్నాన్ని ప్రస్తావించారు. దాడి జరిగిన సమయంలో తానూ అప్రమత్తంగా లేకపోతే కత్తి తన గొంతులో దిగి ఉండేదని అయన పేర్కొన్నారు. ఈ కేసులో స్వతంత్ర సంస్థ దర్యాప్తు కోరుతూ, ఈ దాడి ఎవరు చేసింది, ఈ దాడి వెనక ఎవరు ఉన్నది, దీని వెనక ఉద్దేశం ఏంటన్నది తెలియక ముందే చంద్రబాబు అండ్ కో., నీచ రాజకీయాలకు దిగి డ్రామాలాడారు అని వివరించారు.

పిటీషన్ పై విచారణ జరుపనున్న కోర్ట్ స్వతంత్ర సంస్థల చేత దర్యాప్తుకు ఆదేశిస్తే జగన్ సగం విజయం సాధించినట్లే అని చెప్పాలి. దాడి జరిగిన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు, ఆయన బ్యాచ్, డీజీపీ కలిసి చేసిన హడావుడి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. నిందితుడికి శ్రీనివాస్ తనకు ప్రాణహాని ఉందంటూ మీడియా ముందు మాటాడుతున్న పిచ్చి పిచ్చి మాటలు చూస్తుంటే, దీని వెనక ఎదో ప్లాన్ ఉన్నట్టే అనిపిస్తుంది. ఇదిలా ఉండగా విచారణలో భాగంగా శ్రీనివాస్ కాల్ డేటాను విశ్లేషిస్తున్న అధికారులకు విస్తుపోయే నిజాలు బయటపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రబుత్వ కనుసన్నల్లో ఉండే పోలీస్ వ్యవస్థ, దర్యాప్తు సంస్థలు ఈ కేసును నీరు గార్చవన్న పూచి ఏంటి? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments