కేంద్రం పెట్రోలు ధరలను తగ్గించడం లాంటివి కూడా చేస్తుందా..?

Thursday, October 4th, 2018, 05:36:23 PM IST

గడిచిన గత కొద్ది సంవత్సరాలు కాదు కానీ కేవలం కొన్ని నెలలను చూసుకున్నట్టయితే సామాన్యుడి మీద కేంద్రం మామూలు బాదుడు బాదలేదు.చమురు ధరలు పెరిగిపోతున్నాయని,రూపాయి విలువ పతనం అయ్యిపోతుంది అని విపరీతంగా పెట్రోలు మరియు డీజెల్ ధరలను పెంచేశారు.అంతెందుకు నిన్నటి వరకు కూడా అలా పెంచుతూనే వస్తున్నారు.ఇలా పెరుగుతున్న రేట్లను చూసి సామాన్యుడు పడుతున్న బాధలు కాదు కానీ పెట్రోలు డీలర్ల గుండెల్లో ధడ మొదలయ్యిపోయింది.పెరుగుతున్న పెట్రోలు ధరలను చూసి ఆ ధర ఎక్కడ 100 కు పెరిగిపోతుందో అని వారే ఎక్కువగా భయపడ్డారు.ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భారతీయులకి ఇంకో షాక్ ఇచ్చింది.

ఈ పెరుగుతున్న పెట్రోలు ధరల మీద ఎవ్వరు ఊహించని స్థాయిలో 2.50రూపాయలను తగ్గించేసింది.ఎప్పుడు పెంచుతూ పోయే కేంద్ర ఒక్క సారిగా ఇంత తగ్గించడం కూడా షాకే అని చెప్పాలి.ఇప్పటికే పెట్రోలు ధర గరిష్టంగా 92 రూపాయలకు చేరుకుంది,హైద్రాబాదులో 89 రూపాయలు దాటి ఉంది ఇప్పుడు తగ్గించినా కాస్త ఉపశమనం అని అనుకున్నా మళ్ళీ ఎక్కడ పెంచేస్తుందో అని ప్రజలు భయపడుతున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్రోలు,డీజెల్ ధరలను 5 రూపాయల వరకు తగ్గించాలని అందరు కోరగా ఈ సమయంలో అంత ధర తగ్గించడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది.ఈ సమయంలో గుడ్డి కన్నా మెల్ల నయం అని సామాన్య ప్రజానీకం ఊపిరి పీల్చుకుంటున్నారు.