వైరల్ వీడియో : భయాన్ని చూపించిన పిట్ బుల్ డాగ్!

Monday, April 2nd, 2018, 04:49:45 PM IST

సాధరణ వీధికుక్కల గుంపు ఒక్కసారిగా మీద పడితే ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే అత్యంత బలమైన పిట్ బుల్ అనే కుక్క కూడా ఎగబడితే అలానే ఉంటుంది. భయమంటే తెలియని ఆ కుక్క మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కొన్ని సార్లు పెంచి పోషించిన వారిపైనే దాడికి దిగుతాయి. అందుకే వాటితో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అసలు మ్యాటర్ లోకి వస్తే..

ఇటీవల ఢిల్లీలోని ఉత్తమ్‌ నగర్‌లో ఒక పిట్ బుల్ కుక్క ఇంటి నుంచి తప్పించుకొని వచ్చి స్థానిక కాలనీ వాసులను భయానికి గురి చేసింది. మొదట ఓ పిల్ల వాడిపైకి దూసుకెళ్లిన ఆ కుక్క ఎంత మంది ఆపినా కూడా అస్సలు ఆగలేదు. ఓ మహిళ ఎంతో దైర్యంగా వెళ్లి బాలుడిని కాపాడింది. కర్రతో కుర్చితో దాన్ని కొట్టడానికి ప్రయత్నించినా ఇద్దరు వ్యాకులపై దాడి చేయడానికి కూడా పిట్ బుల్ ప్రయత్నించింది. మొత్తంగా పిట్ బుల్ దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఘటన మొత్త సమీపాన ఉన్న సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది.

  •  
  •  
  •  
  •  

Comments